RC 16: రామ్ చరణ్ అతని బయోపిక్ చేయబోతున్నాడా.. బుచ్చిబాబు స్పెషల్ ఎట్రాక్షన్ ఏమిటంటే?

ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాటతో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. ఆ పాటకు ఆస్కార్ రావడంతో చెర్రీకి మరింతగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గేమ్ చెంజర్ అనంతరం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ సినిమా ఒక బయోపిక్ అని బుచ్చిబాబు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేలా ఒక ప్లాన్ రెడీ చేసినట్లు టాక్ వస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

RC16 is the biopic of The Forgotten Legendary Indian Wrestler Kodi Rammurthy Naidu

ముందుగా గేమ్ ఛేంజర్ అప్పుడే..: ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకున్నప్పటికి ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో RC 16: మరోవైపు తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు తన తదుపరి చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో RC16 తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ పట్ల సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

RC16 is the biopic of The Forgotten Legendary Indian Wrestler Kodi Rammurthy Naidu

సినిమాలో అదే స్పెషల్ ఎట్రాక్షన్: బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16 మూవీ స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రంగస్థలం మూవీకి మించి మరో రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడతారని సమాచారం. సినిమాలో అదే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతోందట.

చరణ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్: రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీలో చెర్రీ గోదావరి యాసతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లా నిలిచింది.

సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రంగస్థలం మూవీ స్క్రిప్ట్ పై కూడా పని చేసిన విషయం తెలిసిందే.బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న RC16 మూవీలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రను బుచ్చిబాబు చాలా భిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.

RC16 is the biopic of The Forgotten Legendary Indian Wrestler Kodi Rammurthy Naidu

ఆయన బయోపిక్ గా రానుందా?: అంతే కాదండోయ్ RC16 లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ గా తెరకెక్కనున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. శ్రీకాకుళంలో పుట్టిన ఈయన ఆ తర్వాత విజయనగరంలో పెరిగారు. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈయన గొప్ప రెజ్లర్ గా పేరు పొందాడు.

ఒంటి చేత్తో రైల్ ఇంజిన్‌ను ఆపారని, ఏనుగును మోసుకెళ్లగల బలశాలి అనే పేరు ఉంది. కోడి రామ్మూర్తి నాయుడు మద్రాసులోని వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని తిరిగి విజయనగరానికి వచ్చి అక్కడ వ్యాయామ శిక్షకుడిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X