RC16 రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ఇదేదో తేడాగా ఉందే!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తండ్రిని మించిన నటుడుగా రామ్ చరణ్ గుర్తింపు సాధించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తి కాకముందే బుచ్చిబాబుతో కలిసి మరో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ తాజాగా ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రామ్ చరణ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రామ్ చరణ్ రీల్స్, న్యూస్ కనిపిస్తున్నాయి. అంతలా ట్రెండింగ్ లోకి వచ్చేశాడు చెర్రీ. ఆర్ఆర్ఆర్ తర్వాత అటు ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉంటే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా మారిపోయాడు. ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. రామ్ చరణ్ కు జోడీగా కియారా అడ్వానీ నటిస్తుంది.

గేమ్ ఛేంజర్ ఈఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు సినీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెర్రీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. రామ్ చరణ్ మరో దర్శకుడితో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనతో కలిసి తన 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఆర్సీ 16.
ఇప్పటికే ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ ఫిక్స్ చేసుకుంది. చెర్రీ సరసన తొలిసారిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. చెర్రీ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్. ఈ సినిమా ఓపెనింగ్ అండ్ టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఈ నెల 20న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు మేకర్స్. అంతే కాదు ఆరోజునే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారట.

రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వర్కింగ్ టైటిల్ ఆర్సీ 16. ఇక ఈ సినిమా టైటిల్ ను 'పెద్ది' అని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ఈ సినిమాకు ఆ టైటిల్ ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినికిడి. అయితే ఈ టైటిల్ విన్న చెర్రీ ఫ్యాన్స్ ఈ టైటిల్ ఏదో తేడాగా ఉందేంటి అంటున్నారు. అసలు పెద్ది అంటే ఏంటి.. దేనికి పెద్ది.. ఇది పాన్ ఇండియా టైటిల్ అస్సలు కాదని కామెంట్ చేస్తున్నారు.
ఇక ఒక సినిమా స్టోరీ ఎలా ఉన్నా.. ముందుగా జనాల్లోకి తీసుకువెళ్లేది టైటిల్. మరి ఈ పెద్ది ఏ రేంజులో జనాలకు చేరువ అవుతుందో చూాడలి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో చెర్రీ సరనస జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. శివ రాజ్ కుమార్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తోంది.. వ్రిద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











