RC17: సుకుమార్ సినిమా కోసం టాప్ హీరోయిన్ల పోటీ.. రామ్ చరణ్‌కు జోడీ ఎవరంటే.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన 'పెద్ది'సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. మరోసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో జతకట్టనున్నారు. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన 'రంగస్థలం' ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో RC17 (వర్కింగ్ టైటిల్)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే.. RC17లో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారు?

'పెద్ది'సక్సెస్ మీట్‌లో RC17పై సుకుమార్ హింట్
హైదరాబాద్‌లో నిర్వహించిన 'పెద్ది' సక్సెస్ సెలబ్రేషన్‌లో దర్శకుడు సుకుమార్ చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన.. రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. రంగస్థలం కంటే కూడా ఈ సినిమాలో చరణ్ నటన మరో స్థాయిలో ఉంది. ఆయన నటన చూస్తుంటే మేమే ఆశ్చర్యపోయాం అంటూ ప్రశంసించారు. అదే సమయంలో అభిమానులు RC17 అప్‌డేట్ అడగగా.. "నేను మాటలు చెప్పేవాడిని కాదు. మీరు ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించే సినిమా ఉంటుంది" అంటూ ఒక్క మాటతోనే భారీ హైప్ పెంచేశారు. కథ గురించి ఒక్క వివరమూ చెప్పకపోయినా.. ఆయన తమ మాటలతో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

RC17 Heroine Race Kiara Advani or Rukmini Vasanth Sukumar-Ram Charan Buzz Grows

హీరోయిన్ విషయంలో రెండు పేర్లు
RC17లో హీరోయిన్ ఎంపికపై ప్రస్తుతం రెండు పేర్లు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, మరోవైపు కన్నడ భామ రుక్మిణి వసంత్. కొన్ని సినీ వర్గాల కథనాల ప్రకారం.. కియారా అద్వానీతో ఇప్పటికే చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ','గేమ్ ఛేంజర్' చిత్రాల్లో కియారా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈ జోడీపై కాస్త నెగటివ్ సెంటిమెంట్ కూడా ఏర్పడింది. అయితే సుకుమార్ మాత్రం అలాంటి సెంటిమెంట్లను పట్టించుకోకుండా.. కథకు కియారానే సరిపోతుందని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

రుక్మిణి వసంత్ పేరు కూడా రేసులోనే
ఇక మరోవైపు RC17 కోసం రుక్మిణి వసంత్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది.'సప్త సాగరాలు దాటి' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం దక్షిణాదిలో ఆమె ఎనలేని క్రేజ్ ఉంది. 'కాంతార చాప్టర్-1', యశ్ 'టాక్సిక్', ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే.'రంగస్థలం'లో సమంత పాత్ర, 'పుష్ప'లో రష్మిక పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందుకే RC17లో కూడా హీరోయిన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉంటుందని, ఆ పాత్రకు రుక్మిణి వసంత్ సరిపోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

హీరోయిన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు
సుకుమార్ సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్ పాత్ర కూడా కథను ముందుకు నడిపించేలా ఉంటుంది. ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో RC17లో హీరోయిన్ ఎవరు ? అన్నది కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ రుక్మిణి వసంత్ ఎంపికైతే.. ఆమెకు వరుసగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు దక్కినట్లే అవుతుంది. మరోవైపు కియారా ఎంపికైతే.. చరణ్-కియారా జోడీ మూడోసారి తెరపై కనిపించబోతోంది. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. RC17 హీరోయిన్ ఎవరనే విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read more about: ram charan kiara advani sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X