రామ్ చరణ్‌తో పాన్ ఇండియా హీరోయిన్ రొమాన్స్..రంగస్థలం ని మించిపోయేలా సుక్కూ ప్లాన్
Ram Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్‌లో భారీ హైప్ నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు రాబోయే కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా RC17 అని పిలుస్తుండగా, ఇది రెండు భాగాలుగా తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామా అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న. ఇంతకీ హీరోయిన్ ఎవు
ప్రస్తుతం చరణ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'తో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఫిబ్రవరి 14 (వాలెంటైన్స్ డే) లేదా 15న రెండో పాటను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ చేసే డాన్స్ స్టెప్పులు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయట.

హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో శివ రాజ్ కుమార్, జగపతి బాబు కనిపించనున్నారు. మొదట మార్చిలో అనుకున్న రిలీజ్‌ను షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేసి, 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అప్పటివరకు వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్ పెంచాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. పెద్ది సినిమా పూర్తయిన వెంటనే RC17పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారని సమాచారం. మేకర్స్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారని వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ మూవీకి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం.
కథ, స్క్రీన్‌ప్లే దశ పూర్తయ్యిందని, చరణ్ కోసం సుకుమార్ ఓ పవర్‌ఫుల్ మాస్ పాత్రను రెడీ చేశాడని టాక్. రంగస్థలం మూవీ తరహాలోనే గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో పాటు ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ మార్క్ డీటైలింగ్, క్యారెక్టర్ బిల్డప్ ఈ ప్రాజెక్ట్‌లో మరో స్థాయిలో ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అనుపమ పరమేశ్వర్, సమంత వంటి పేర్లు వినిపించాయి. కానీ, తాజాగా 'పుష్ప' సిరీస్‌తో సుకుమార్ దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్నరష్మిక మందన్నా(Rashmika Mandanna) పేరు వినిపిస్తోంది. దాదాపు నేషనల్ క్రష్ ను ఫైనల్ చేసినట్టు టాక్. ఇది నిజమైతే, రష్మికకు సుకుమార్‌తో మూడో సినిమా అవుతుంది, అలాగే రామ్ చరణ్‌తో మొదటి జోడీ కావడం ఈ ప్రాజెక్ట్‌ను మరింత స్పెషల్‌గా మార్చుతుంది.
మరోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కూడా పరిశీలనలో ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో, డేట్స్ మ్యాచ్ అయితే ఆమెను తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే హీరోయిన్ ఎంపికపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మేకర్స్ మాత్రం కథకు సరిపోయే ఫ్రెష్ ఫేస్ కావాలా? లేక పాన్ ఇండియా గుర్తింపు ఉన్న హీరోయిన్ కావాలా? అన్న అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారట.
ఇతర టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ లేదా ఏఆర్ రెహమాన్ పేర్లు వినిపిస్తున్నాయి. 'పుష్ప' తర్వాత సుకుమార్ తీస్తున్న సినిమా కావడంతో, మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కథ ట్రీట్‌మెంట్ పూర్తిగా కొత్తగా, ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతుందని అంటున్నారు. ఇలా రామ్ చరణ్ - సుకుమార్ కాంబో మళ్లీ తెరపైకి రావడంతో టాలీవుడ్‌లో ఎక్సైట్‌మెంట్ పీక్స్‌కు చేరింది. హీరోయిన్ ఎవరు అన్న విషయం అధికారికంగా బయటపడితే ఈ ప్రాజెక్ట్ హైప్ ఇంకో లెవల్‌కు వెళ్లడం ఖాయం. 'రంగస్థలం' మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? ఈసారి సుక్కూ ఎలాంటి సర్ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాడు? అన్న ఉత్కంఠతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











