RC17 పాన్ ఇండియా దర్శకుడితో రామ్ చరణ్ సినిమా... ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇక ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం లెజెండరీ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తుండగా.. మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్.. పాన్ ఇండియా డైెరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
మెగాస్టార్ తనయుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. తండ్రిని మించిన కొడుగ్గా పేరుతెచ్చుకున్న చెర్రీ... వరుస సినిమాలతో బీజీగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చరణ్. ఇక ఆ సినిమా తర్వాత తండ్రి ఆచార్య సినిమాలో గెస్టురోల్ చేశాడు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఆ సిినిమా తర్వాత ప్రస్తుతం లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో చెర్రీ సరసన మరోసారి కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో ఇప్పటికే వినయ విధయ రామా చిత్రం తెరకెక్కింది. అయితే అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ బ్యూటీ మళ్లీ చెర్రీతో జతకట్టుతుంది.
ఇక చెర్రీ గేమ్ ఛేంజర్ సినిమాలో రెండు క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. మరో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. చెర్రీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చే్స్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

ఇక ఈసినిమాలో చరణ్ సరసన తొలిసారిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విజయ్ సేతుపతి, శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కునుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు, అఫిషియల్ అనౌన్స్ మెంట్ చరణ్ బర్త్ డే రోజు అనౌన్స్ చేయనున్నారట. ఇదిలా ఉంటే ఆర్సీ 17 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ఆర్సీ 17 సినిమా అనగా.. చరణ్ తన 17వ సినిమాను పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత పార్ట్ 3 ఉండనుంది. మరి చెర్రీతో ఎప్పుడు సినిమా చేయనున్నాడో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. మరోసారి వీరికాంబో రిపీట్ అయితే బాక్స్ లు బద్దలవ్వాల్సిందే.


Click it and Unblock the Notifications











