20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్? రామ్ చరణ్ కోసం సుకుమార్ కొత్త ప్రయోగం!

టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్- రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబోకు ప్రత్యేకత ఉంది. 'ఆర్య'తో మొదలైన వీరి ప్రయాణం.. జగడం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 వరకు కొనసాగింది. ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు ఏదైనా సక్సెసే. దీంతో సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ సంగీతం అనేది ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కనున్న RC17 విషయంలో అదే కాంబినేషన్ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఫిల్మ్‌నగర్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ ప్రసాద్ దూరమయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ రూమర్లకు ప్రధాన కారణంగా 'పుష్ప 2: ది రూల్' సినిమా మేకింగ్ సమయంలో జరిగిన పరిణామాలేనని చెబుతున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ పనులు అనుకున్న షెడ్యూల్‌లో పూర్తికాలేదని, దీంతో కొన్ని భాగాలకు ఇతర సంగీత దర్శకుల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

RC17 Music Director

ఆ సమయంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ విషయాన్ని అటు సుకుమార్ కానీ, ఇటు దేవిశ్రీ ప్రసాద్ కానీ ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. అయినప్పటికీ అదే ప్రచారం ఇప్పుడు RC17 వరకు కొనసాగుతోంది. రామ్ చరణ్ మూవీ కోసం సుకుమార్ కొత్త తరహా సౌండ్‌ను ట్రై చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాకు సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ పేరు వినిపిస్తోంది. అలాగే అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్, కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, మరోవైపు పూర్తిగా భిన్నమైన సమాచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకటి రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినంత మాత్రాన 20 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను సుకుమార్ పక్కన పెట్టే అవకాశాలు తక్కువేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్‌కు దేవిశ్రీ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. అందుకే RC17లో కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారని, చివరికి దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా కొనసాగించే అవకాశాలున్నాయని కూడా మరో వర్గం చెబుతోంది.

ప్రస్తుతం RC17 స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా? లేక సుకుమార్ కొత్త సంగీత దర్శకుడితో ముందుకు వెళ్తారా? అన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X