twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీతాంజలి’సెన్సార్ ఇష్యూ వెనక నిజం

    By Srikanya
    |

    హైదరాబాద్ : అంజలి హీరోయిన్‌గా నటించిన సినిమా 'గీతాంజలి'. ఈ శనివారం విడుదల కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ విషయమై ఇబ్బందులు పడ్డాయని వార్తలు వచ్చాయి. ఆ ప్రెజర్ తోనే దర్శకుడు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జూలై 29న సెన్నార్ కి అప్లై చేసి, రోజూ తిరిగారు. అయినా సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి...ఈ సినిమా కన్నా సెన్సార్ కావాల్సిన చిత్రాలు ఇంకా కొన్ని ఉన్నాయని ఆపారని తెలిసింది. అయితే ఆ చిత్రాలు ఏమీ రిలీజ్ అయ్యే చిత్రాలు కావని, కేవలం డిజిటల్ ఫార్మెట్ లో చేసి సెన్సార్ కి వచ్చినవి..వాటి కోసం ఆపుచేసారని అన్నారు.

    కోన వెంకట్‌ మాట్లాడుతూ ''పలు అడ్డంకులను దాటుకుని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 9న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం. అంజలి మేజర్‌ రోల్‌ చేసింది. తను లేకుంటే సినిమానే లేదు. ఈ చిత్రం తనకు అద్భుతమైన టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. నాకు 'ఢీ' సినిమాలాగే ఈ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ప్రవీణ్‌ లక్కరాజు, శ్రీజో మంచి పాటలనిచ్చారు. శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానందం ఇలా ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంది. రాజకిరణ్‌ చక్కగా తెరకెక్కించారు'' అని తెలిపారు

    Real facts behind Geethanjali Censor issue

    అంజలి మాట్లాడుతూ ''మా దర్శకుడు రాజకిరణ్‌ చెస్ట్‌పెయిన్‌తో హాస్పిటల్‌లో జాయిన్‌ కావడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్‌గారి సహకారం మరువలేనిది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్‌, డిసి్ట్రబ్యూటర్‌ హరి తదితరులు పాల్గొన్నారు.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రధారులు. ఈ సినిమాకు రాజ కిరణ్‌ దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. యం.వి.వి.సినిమా పతాకంపై యం.వి.వి.సత్యనారాయణ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చారు.

    English summary
    'Geethanjali' director Raj Kiran suffered a heart stroke following delay in the Censor of the film which is slated for August 8th release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X