»   » నిత్యానంద సెక్స్ భాగోతంపై రియల్ సినిమాలు

నిత్యానంద సెక్స్ భాగోతంపై రియల్ సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నటి రంజితతో రాసలీలలు చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికి పోయిన తమిళనాడు స్వామీజీ నిత్యానంద.....పోలీసుల ముందు నిజం ఒప్పకున్నట్లే ఒప్పుకుని బయటకు వచ్చాక అదంతా అబద్దం, ఆ వీడియో గ్రాఫిక్ మాయా జాలం అంటూ కహానీలు చెబుతూ భక్తులను నమ్మిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఆయన అసలు రూపం గ్రహించి అతనికి దూరమైనా, కొందరు వీర భక్తులు మాత్రం ఆయన చెప్పిందే నిజం అంటూ ఇంకా నిత్యానంద భజనే చేస్తున్నారు.

తప్పును కప్పి పుచ్చు కోవడానికి నిత్యానంద తన ప్రయత్నాల్లో ఉంటే.....నిత్యానంద భాగోతాన్ని ప్రజలకు వివరించడానికి సినిమాలు కూడా రూపొందుతున్నాయి. అందులో ఒకటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'అయ్యారే" సినిమా కాగా, రెండోది 'బాబాల భాగోతం". బాబాల భాగోతంలో నిత్యానంద తో పాటు పలువు దొంగ బాబాల భాగోతం గురించి వివరించనున్నారు. ఇందులో నిత్యానంద రోల్ ను సత్య ప్రకాష్ చేస్తున్నాడు. తనను అవమానించే విధంగా సినిమాలు తీస్తున్నారంటూ...ఇప్పటికే అయ్యారే సినిమాపై కోర్టుకు వెళ్లిన నిత్యానంద, తాజాగా బాబాల భాగోతంపై కూడా ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

English summary
This is happening in ‘Babala Baagotham’ and ‘Ayyare’ is just small coincidence since Rajendra Prasad’s look was designed that way. Sources say ‘Babala Baagotham’ has Sathyaprakash enacting the role of Nityananda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu