»   » నిజమా? రూమరా?..... ప్రభాస్ అనుష్కను పెళ్లాడబోతున్నాడా?

నిజమా? రూమరా?..... ప్రభాస్ అనుష్కను పెళ్లాడబోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాహుబలి సినిమా గురించి ఎంత చర్చ జరిగిందో.... ప్రభాస్ పెళ్లి గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగిందనేది కాదనలేని వాస్తవం. బాహుబలి సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు పెళ్లిని కూడా వాయిదే వేసుకుని తన పూర్తి సమయాన్ని కేటాయించిన ప్రభాస్..... ఈ గ్యాపులో దాదాపు 6000 మ్యారేజ్ ప్రపోజల్స్ రిజక్ట్ చేసాడంటూ కూడా వార్తలొచ్చాయి.

  అప్పట్లో పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్ అడిగితే..... బాహుబలి సినిమా తర్వాత అంటూ తప్పించుకుంటూ వచ్చి, ఇపుడేమో పెళ్లి ఎప్పుడో తెలియదు, ఎలా జరుగాల్సింది అలా జరుగుతుంది అంటూ మాట మార్చాడు.

  తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాక పోవడానికి ప్రత్యేకంగా కారణం ఉందని, ప్రభాస్ ప్రేమలో ఉండటమే అందుకు కారణమని అంటున్నారు.

  అనుష్కను పెళ్లాడబోతున్నాడా?

  అనుష్కను పెళ్లాడబోతున్నాడా?

  ప్రభాస్ ప్రేమలో పడింది మరెవరితోనో కాదని, బాహుబలి సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ అనుష్కతోనే అని అంటున్నారు. అనుష్కనే పెళ్లి చేసుకోవడానికి ప్రభాస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

  బాహుబలి షూటింగులో లవ్వాయణం

  బాహుబలి షూటింగులో లవ్వాయణం

  బాహుబలి సినిమా కోసం ఏళ్ల తరబడి కలిసి పనిచేసారు ప్రభాస్, అనుష్క. ఈ క్రమంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు బాగా అర్థం చేసుకున్నారని, ఈ క్రమంలోనే ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారని.... బాహుబలి సినిమా షూటింగ్ ముగిసే సమయానికి ఇద్దరి ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందని టాక్.

  ఇంట్లో ఒత్తిడి

  ఇంట్లో ఒత్తిడి

  ప్రభాస్ వయసు 40కి చేరువవుతుండటంతో ఇంట్లో నుండి కూడా పెళ్లి గురించి ఒత్తిడి పెరిగింది. ఇంకా కొంతకాలం వారు డేటింగ్ చేద్దామని అనుకున్నప్పటికీ వాళ్ల ఒత్తిడితో త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్.

  ప్రభాస్ ఫ్యామిలీకి దగ్గరైన అనుష్క

  ప్రభాస్ ఫ్యామిలీకి దగ్గరైన అనుష్క

  బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ తో పాటు వారి ఫ్యామిలీకి కూడా అనుష్క దగ్గరైంది. అనుష్క చాలా మంచి అమ్మాయి అని రాజమౌళి ఫ్యామిలీ రికమండేషన్ కూడా ఉండటంతో వీరి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

  అనుష్క పెళ్లి పోస్టు పోన్ చేయడానికి కారణం అదే..

  అనుష్క పెళ్లి పోస్టు పోన్ చేయడానికి కారణం అదే..

  అనుష్క కూడా ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె వయసు కూడా 35కి చేరువైంది. ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టే అనుష్క తన పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిందని అంటున్నారు.

  టాప్ సీక్రెట్

  టాప్ సీక్రెట్

  తమ ప్రేమ విషయం ఇన్నాళ్లు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంలో ప్రభాస్, అనుష్క సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లు వారు పూర్తి క్లోజ్డ్ గా బాహుబలి సెట్స్ లో నే ఉంటూ వచ్చారు కాబట్టి అది సాధ్యమైంది.

  అభిమానులు కూడా హ్యాపీ

  అభిమానులు కూడా హ్యాపీ

  ప్రభాస్, అనుష్క వివాహం జరిగితే అభిమానులు కూడా హ్యాపీ. ఇద్దరి ఈడు జోడు బాగా కుదురుతుందని, ఈ జంట సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ చూడ ముచ్చటగా ఉంటారని అంటున్నారు.

  అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది

  అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది

  అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. ప్రభాస్ నుండిగానీ, అనుష్క నుండి గానీ ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

  English summary
  Baahubali star Prabhas is giving sleepless nights to many girls ever since the news of his marriage has gone viral. It was reported that Prabhas will get married once he finishes the shooting of Baahubali franchise. And when everyone is waiting for the big news, rumours of his closeness with Anushka Shetty aka Devsena of Baahubali is doing the rounds.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more