'శ్రీరామ రాజ్యం' వాయిదాకు అస్సలు కారణం
బాలకృష్ణ తాజా చిత్రం 'శ్రీరామరాజ్యం' పై ఆయన అభిమానులే కాక పౌరాణిక చిత్రాలను ఇష్టపడే వారంతా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మొదట దశరాకు వస్తుందనుకున్న ఈ చిత్రం ఆ తర్వాత రేసు నుంచి తప్పుకుంది. దానికి కారణం అందరూ ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో రెడీ అవుతున్న ఊసరవిల్లి చిత్రం అనుకున్నారు. అయితే అది కారణం కాదని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల ఆలస్యానికి కారణం సంగీత దర్శకుడు ఇళయరాజా అని చెన్నై పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది.
ఆయన కుమారుడు యవన్ శంకర్ రాజా వివాహం హడావిడి,బంధువులు రాకపోకలు వీటిలో ఆయన పూర్తిగా మునిగిపోయాడని అందుకే రీ రికార్డింగ్ చేయలేదని అదే సినిమా విడుదల ఆగటానికి మెయిన్ కారణమని చెప్తున్నారు. ప్రస్తుతం నేపథ్యసంగీతం పనులు జరుగుతున్నాయి. హంగేరి రాజధానిబుడాఫెస్ట్‌లో ట్రాక్ మిక్సింగ్ కార్యక్రమాలు త్వరలో ఉంటాయి. హంగేరి నుంచి ఎనిమిది మంది సభ్యులు ఇప్పుడున్న రీరికార్డింగ్ బృందంతో త్వరలో కలుస్తారు. మరోవైపు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తి కావచ్చాయి. ఇక డీఐ, డీటీయస్ పనులున్నాయి. వాటిని కూడా ముగించి అక్టోబర్ లోపు చిత్రాన్ని ప్రేక్షకులకు కనువిందు చేయాలనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











