Kalki 2898 AD టైటిల్ వెనక పెద్ద కథే ఉందిగా.. ఊహించన రేంజ్‌లో నాగ్ అశ్విన్ ప్లాన్.. అసలు స్టోరీ ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ విడుదలైంది. టైటిల్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. శాన్ డియాగో వేదికగా ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయడం.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 'కల్కి 2898 AD' అని టైటిల్ ఫిక్స్ చేశారు. మరి ఈ టైటిల్ వెనక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం...
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ రిలీజైంది. 'కల్కి 2898 AD' అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ టైటిల్ ను బట్టి.. సైన్స్ ఫిక్షన్ మూవీకి కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఇచ్చినట్టు అర్థమవుతోంది. మొదటి నుంచి ఈ సినిమాలోని పాత్రలు ఇతిహాస పాత్రలకు అనుగుణంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రభాస్ కల్కి రూపమని, అమితాబ్ అశ్వత్థామ అని అంటున్నారు.

కల్కి అంటే ఏంటంటే.. :పురాణాల్లో మహా విష్ణువు అవతారాల్లో పదో అవతారం కల్కి. ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. వీర ఖడ్గంతో, తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను శిక్షిస్తాడని కల్కి అవతారం గురించి పురాణాలు చెబుతున్నాయి. దీనినే ప్రామాణికంగా తీసుకొని దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది.

2898 AD అంటే... :అలానే టైటిల్ లో 2898 AD ని రాసుకొచ్చారు. ప్రస్తుతం క్రీస్తు శకం AC నడుస్తున్న సంగతి తెలిసిందే. గతాన్ని క్రీస్తు పూర్వం BCగా అభివర్ణించేవారు. ఇక రాబోయే యుగాన్ని AD(Anno Domini)గా చెబుతున్నారు. అంటే 2898 వరకు ఈ కాలంలో పాపాలు బాగా పెరిగిపోయి వాటిని నివారించేందుకు కల్కి అవతరిస్తాడని అంతా అంటున్నారు. అదే విధంగా హాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే ఈ టైటిల్ ను ఖరారు చేశారని చెబుతున్నారు.

హాలీవుడ్ స్టైల్ లో గ్లింప్స్.. :ఇక గ్లింప్స్ విషయానికి వస్తే.. హాలీవుడ్ రేంజ్ లో దీన్ని తెరకెక్కించారు. కాస్ట్యూమ్స్, విజువల్స్ ఇలా ప్రతిదీ హాలీవుడ్ స్టైల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు నాగ్ అశ్విన్. సూపర్ హీరోగా ప్రభాస్ లుక్.. ఆయన ఎంట్రీ బాగుందని అంటున్నారు. దీపిక పదుకొణె స్టైల్ కూడా అదిరింది. అమితాబ్ ను ఒక్క షాట్ లోనే చూపించి చూపించనట్టుగా చేశారు. మొత్తంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ మీద వచ్చిన ట్రోల్స్ కు ఈ గ్లింప్స్ చెక్ పెట్టిందనే చెప్పొచ్చు.

ఇకపోత ఈ సినిమా విషయానికొస్తే... :దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సినిమాను 2024లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నాారు. బాలీవుడ్ హాట్ బ్యూటీలు దీపికా పదుకొణె, దిశా పటానీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











