అల్లు అర్జున్, సుకుమార్ ల 'ఆర్య-2' అసలు గొడవ

By Srikanya

ఆర్య-2 చిత్రం రిలీజ్ విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ కోపంగా ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు ఇద్దరు మద్య గొడవే పెరిగి పెద్దదై ప్రాజెక్టును ఆలస్యం చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రం నిర్మాతలో ఒకరైన ఆదిత్యబాబుకి కాస్త స్పీడు ఎక్కువ అవటమే ఈ సమస్యకు ప్రారంభం అని తెలుస్తోంది. మరో నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ని ప్రక్కన పెట్టి ఆదిత్యబాబు పోస్టర్స్ పై ఏన్ ఆదిత్య అర్ట్స్ ఫిలిం అని వేసారు. అదే ప్రసాద్ కి కాలింది. అందులోనూ ప్రసాద్ ఈమధ్య మగధీర చిత్రానికి ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకుని అల్లు అరవింద్ కి, బన్నీ కి దగ్గరయ్యాడు. దాంతో అల్లు అర్జున్ కూడా ఆదిత్యపై కోపం తెచ్చుకున్నారు. అసలు ఈ నిర్మాతలను ఇద్దర్నీ కలిపింది సుకుమార్. జగడం ఫ్లాప్ కావటంతో ఆ నిర్మాత ఆదిత్యబాబుకి సినిమా చేయాల్సి వచ్చింది. అలాగే ప్రసాద్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవటంతో ఆయనకూ సినిమా చేయాల్సివచ్చింది. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు తరహాలో ఇద్దరినీ కలిపి జగడానికి తెర తీసాడు సుకుమార్. దాంతో అంతా సుకుమార్ పై కూడా గుర్రుగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X