For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కళ్యాణ్ లుక్ ని అందుకే ఆపారా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఆయన తాజా చిత్రం గోపాల గోపాల ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అంతా భావించారు. ఆ మేరకు మీడియాలో కథనాలు సైతం వచ్చి అభిమానుల్లో ఆసక్తిని రేపాయి. అయితే ఫస్ట్ లుక్ రాలేదు. చాలా మంది పవన్ అభిమానులు ఈ విషయమై నిరాశ చెందటం జరిగింది. అయితే దీని వెనకాల ఓ కారణం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

  మొదట పవన్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ విడుదల చేద్దామని అనుకున్నా తర్వాత విరమించుకోవటానికి కారణం తర్వాత వచ్చిన ఆలోచన అంటున్నారు. గోపాల గోపాల చిత్రంలో యుఎస్ పి..పవన్ ఎలా కృష్ణుడు గెటప్ లో కనపడతాడా అని. అది థియోటర్ కి వెళ్లే వరకూ ఆపుదామని అంటున్నారు. అయితే ఫస్ట్ లుక్ టీజర్ లో విడుదల చేసేయవచ్చు అని కొందరు అంటున్నారు. షూటింగ్ సగంలో ఉండగా ఈ ఫస్ట్ లుక్ విడుదల చేయటం వల్ల వారి క్యూరియాసిటీని దెబ్బతీసినట్లు అవుతుందని భావించారని చెప్పుకుంటున్నారు.

  ఇక పవన్‌కల్యాణ్‌ 'గోపాల గోపాల'లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రలో పవన్‌ పలికే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. పవన్‌ అభిమానుల్ని మరింతగా సంతోషపెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా పాత్రని మరికొంచెం పెంచాలని చిత్రబృందం భావించిందట. అయితే పవన్‌ ఆ ప్రయత్నాన్ని మొదట్లో తిరస్కరించినట్టు సమాచారం. కథని ఉన్నదున్నట్టు తీస్తేనే మేలని... పాత్రని ఏమాత్రం కదపనీయలేదట. కానీ ఇప్పుుడ మార్చిన స్క్రిప్టు విని బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

  Reason behind Gopala Gopala movie first look absence

  వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ జోడీ చాలా బాగుందనీ... వారిద్దరూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాలు పంచబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. త్వరలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

  హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' చిత్రానికిది రీమేక్‌. పవన్‌ కల్యాణ్‌ మోడరన్‌ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్‌ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.

  సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్‌, దీక్షా పంత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, కూర్పు: గౌతంరాజు

  English summary
  Pawan fans thought Gopala Gopala movie first look will be released on his birthday, but they are disappointed with maker’s decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X