twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బు ఇవ్వలేదనే ఆ స్టార్స్ అంతా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ బహిష్కరించారా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Tamil Film Industry Boycotts Filmfare Awards

    సినిమా స్టార్స్ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్స్ హాజరైనప్పటికీ.... తమిళం నుండి పెద్ద స్టార్స్ మాత్రం రాలేదు. కొందరు చిన్న స్టార్స్ మాత్రమే ఈ అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. అయితే వీరు ఈ వేడుకకు హాజరు కాకపోవడానికి గల కారణం ఏమిటో తెలిసి పోయింది. డబ్బు ఇవ్వక పోవడం వల్లనే వారంతా ఫిల్మ్ ఫేర్ వేడుకను బాయ్‌కాట్ చేశారని ప్రచారం జరుగుతోంది.

    డొనేషన్ ఇవ్వలేదనే కోపంతో...?

    డొనేషన్ ఇవ్వలేదనే కోపంతో...?

    తమిళ సినీ వర్గాల కథనం ప్రకారం.... ఫిల్మ్‌ఫేర్ ఈవెంట్ ఆర్గనైజర్లు తమిళ సినీ యాక్టర్స్ అసోసియేషన్ నడిగర్ సంఘానికి, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు అడిగిన మొత్తంలో డొనేషన్లు ఇవ్వలేదనే కోపంతోనే అంతా కలిసి ఈ వేడుకను బహిష్కరించారని తెలుస్తోంది.

     కమర్షియల్‌గా మారిన అవార్డ్స్ ఫంక్షన్స్

    కమర్షియల్‌గా మారిన అవార్డ్స్ ఫంక్షన్స్

    గతంలో సినిమా రంగానికి సంబంధించి ఫంక్షన్లు, అవార్డ్స్ సెర్మనీలు, డాన్స్ ప్రోగ్రామ్స్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ జరిగినపుడు నటులంతా పాల్గొనేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కమర్షియల్ అయిపోయాయి. భారీగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయా ఆర్గనైజేషన్స్ ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అవి కమర్షియల్ అయ్యాయి కాబట్టే.... తమిళ సినీ నటుల సంఘం కూడా అభివృద్ధి పనులు కోసమని భారీ మొత్తం డొనేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

     డబ్బు చెల్లిస్తేనే ఇకపై..

    డబ్బు చెల్లిస్తేనే ఇకపై..

    కమర్షియల్‌గా జరిగే ఇలాంటి కార్యక్రమాలకు నటీనటులు రావాలంటే... వారికి వ్యక్తిగతంగా డబ్బు చెల్లించడం కానీ, నడిగర్ సంఘం లేదా టిఎఫ్‌పిసి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయాలని తమిళ నటీనటుల సంఘం నిర్ణయించినట్లు సమాచారం.

    త్రిష, నయనతార, కార్తి అంతా దూరం

    త్రిష, నయనతార, కార్తి అంతా దూరం

    డొనేషన్ ఇవ్వని కారణంగా త్రిష, నయనతార, కార్తి లాంటి టాప్ రేటెడ్ స్టార్స్ ఎవరూ హాజరు కాలేదని సమాచారం. ఇలాంటి ఈవెంట్లు జరిగినపుడు ఆర్గనైజర్లు రూ. 10 నుండి రూ. 40 లక్షలు చెల్లిస్తారని టాక్. అయితే ఈ సారి ఫిల్మ్ ఫేర్ ఆర్గనైజర్లు నడిగర్ సంఘానికి కానీ, సినీ తారలకు కానీ డబ్బు చెల్లింక పోవడం వల్లే ఇలా చేశారని తెలుస్తోంది.

    కోట్లు సంపాదిస్తున్న ఆర్గనైజర్లు

    కోట్లు సంపాదిస్తున్న ఆర్గనైజర్లు

    అవార్డ్స్ ఫంక్షన్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజర్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ఫంక్షన్లలో వివిధ కార్పొరేట్ బ్రాండ్లను ప్రమోట్ చేయడంతో పాటు.... భారీ రేటుకు ఈ అవార్డ్ సెర్మనీకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

    English summary
    Kollywood audience were in surprise when they realised that not many from Tamil films were attending the Jio 65th Filmfare Awards. Now, it has been revealed that the Kollywood celebs boycotted the event on the advice of Nadigar Sangam. A report on The News Minute claims that the organisers failed to pay donation neither for the actors' guild nor for the Tamil Film Producers' Council (TFPC).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X