మహేష్ బాబు గై హాజరు వెనుక అసలు కారణం ఇదేనా? సరిలేరు నీకెవ్వరు!
మహేష్ బాబు 26 వ చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ రోజే (మే 31) న ప్రారంభోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తప్ప హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ అనిల్ రావిపూడి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నిర్మాత అనిల్ సుంకర, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. మొదటి షాట్‌కి కె.రాఘవేంద్రరావు క్లాప్ కొత్తగా.. అరుంధతి చిత్ర నిర్మాత శ్యామ్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేష్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది.
అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం మేరకు మహేష్ బాబు తన భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సీతారాలతో కలిసి ఫారెన్ టూర్ లో ఉన్న కారణంగానే ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు కావాలనే ముహూర్తపు షాట్ రాలేదని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్.. తాను ముహూర్తపు షూట్ కి వస్తే సినిమా ప్లాప్ అవుతుందని, అందుకే రానని చెప్పారు. ఈ ఇష్యుపైనే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాకూడదనే ఉద్దేశ్యంతోనే మహేష్ ఫారెన్ టూర్ వెళ్లాడని చెప్పుకుంటున్నారు జనం.

నిజానికి మహేష్ గత ఆరేడు సినిమాల నుంచి ముహూర్తపు షాట్ కి దూరంగా ఉంటున్నారు. ఆ సెంటిమెంటే కంటిన్యూ చేస్తూ తన 26 వ సినిమా ముహూర్తపు షాట్ కి కూడా దూరంగా ఉన్నారని ఫిలింనగర్ టాక్. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేస్తూనే ఒక నిర్మాతగా భాగమవడం విశేషం. మరోవైపు ఇదే సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనుండటం ప్రేక్షక లోకానికి ఆసక్తి కలిగించే అంశం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











