»   »  చల్లారని మంట: బాలయ్య పిలవలేదా? నాగ్ డుమ్మా కొట్టాడా?

చల్లారని మంట: బాలయ్య పిలవలేదా? నాగ్ డుమ్మా కొట్టాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోలు ఎవరంటే ముందుగా వినిపించేది నలుగురు సీనియర్ హీరోల పేర్లే. వారే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ప్రస్తుతం పరిశ్రమలో వీరి తర్వాతి తరం కుర్రహీరోలు వచ్చినా....ఈ నలుగురికి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

బాలయ్య ప్రస్తుతం 100వ సినిమాకు చేరుకున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య ఇందుకోసం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కథను ఎంచుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈచిత్రం ప్రారంభోత్సవం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తో పాటు... చిరంజీవి, వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమానికి నాగార్జున హాజరు కాక పోవడం చర్చనీయాంశం అయింది. ఈ ఇద్దరి మధ్య గతంలో కొన్ని విబేధాలు ఉండేవి. ఇద్దరి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే నాగార్జున హాజరు కాలేదని అనుమానిస్తున్నారు.

ఒకప్పుడు బాలయ్య, నాగార్జున మధ్య సంబంధాలు బావుండేవి. సినిమాల పరంగా పోటీ ఉన్నా కూడా మంచి అనుబంధం ఉండేది, ఉన్నట్టుండి ఏమైందో ఏమో గానీ రెండు మూడేళ్ళ నుండి వీరిమధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. తన అన్నపూర్ణ స్టూడియోలో కార్యక్రమం జరిగుతున్నా.... నాగార్జున ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నా? ఎందుకు రాలేదు? నాగార్జునకు బాలయ్య చెప్పలేదా, లేకుంటే చెప్పినా రాలేదా? అని టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

 Reason behind Nagarjuna not attending Balakrishna's 100 film launch

వీరి మధ్య విబేధాలు ఏమిటి?
సినిమాల విడుదల సమయంలో ఇద్దరి మధ్య గతంలో కొన్ని విబేధాలు వచ్చాయి. ఓ సారి బాలయ్య సినిమా నడుస్తుండగా బలవంతంగా తీయించేసి నాగార్జున సినిమా వేసారు. ఆ సమయలో బాలయ్య ఆందోళన కూడా చేసారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు చిన్నగా మొదలై...తర్వాత కోల్డ్ వార్ స్టాయికి వేళ్లాయనేది టాక్. ఆ మధ్య నాగార్జున తనయుడు అఖిల్ సినిమా ప్లాప్ అయిన సమయంలో కూడా బాలయ్య కామెంట్స్ వీరి మధ్యహీట్ మరింత పెంచాయని అంటున్నారు.

మోక్షజ్ఞ తొలి సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలి, అలాంటి కథల కోసమే ఎదురు చూస్తున్నారు. ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొంటే...మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్య. నా కొడుకు తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి పాత్రలు వద్దు అని బాలయ్య కామెంట్ చేసారు. ఇటీవల విడుదలై అఖిల్ సినిమాను ఉద్దేశించే బాలయ్య ఆకామెంట్స్ చేసారనే ప్రచారం జరిగింది.

English summary
Read reason behind Nagarjuna not attending Balakrishna's 100 film launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu