Guntur Kaaram పూజా హెగ్డేను గుంటూరు కారం నుంచి ఎందుకు తప్పించారు? బుట్టబొమ్మ అవుట్ వెనుక కారణం ఇదేనట!
దక్షిణాది సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించాయి. దాంతో ఓ దశలో ఆమె డేట్స్ కోసం అగ్ర హీరోలు, నిర్మాతలు వేచి ఉన్న సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఉన్నట్టుంది తెలుగు, దక్షిణాది సినిమాల్లో దాదాపు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తున్నది. ఆమెను గుంటూరు కారం సినిమా నుంచి ఎందుకు తీసేశారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ విషయంలోకి వెళితే..
పూజా హెగ్డే తన కెరీర్ ఆరంభంలో వరుస ఫ్లాపులను చవిచూసింది. అయితే దువ్వాడ జగన్నాథం సినిమా సక్సెస్‌తో కెరీర్ గ్రాఫ్‌ను రివ్వున ఎగిరేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తదితర సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చాయి.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించిన రాధేశ్యామ్‌తో పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో నటించిన బీస్ట్ దారుణంగా పరాజయం పాలైంది. ఆ తర్వాత చిరంజీవి, రాంచరణ్‌తో చేసిన ఆచార్య చిత్రం డిజాస్టర్‌గా మారాయి. దాంతో ఆమె వైపు హీరోలు చూడాలంటే భయపడిన సందర్భాలు ఉన్నాయని సినీ వర్గాలు వెల్లడించాయి.

అలాంటి పరిస్థితుల్లో మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైంది. ఆ సినిమా షూటింగ్ దాదాపు 30 రోజులపాటు జరిగింది అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అయితే ఆ సినిమా కథ నచ్చకపోవడంతో మరో స్టోరి చేద్దామని త్రివిక్రమ్, మహేష్ ఓ నిర్ణయానికి వచ్చారు. 30 రోజుల షూటింగ్‌ను చెత్తబుట్లలో వేసి మరో కథను ట్రాక్‌పైకి తెచ్చారు. అదే గుంటూరు కారంగా మారింది.
అయితే కథ మారడంతో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా మారిపోవడంతో పూజా హెగ్డేను గుంటూరు కారం సినిమా నుంచి తప్పించారు. అప్పటి వరకు సెకండ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్‌గా చేశారు. సెకండ్ హీరోయిన్ స్థానంలో మీనాక్షి చౌదరీని తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. పూజా హెగ్డేను గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడం వెనుక అసలు కారణం ఇదే అని తాజాగా సినీ వర్గాలు అసలు విషయం బయటపెట్టారు.

ఇదిలా ఉండగా, ఊహించని విధంగా ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర వేసుకొంటున్న పూజా హెగ్డేకు వరుసగా దెబ్బ మీద దెబ్బ పడింది. హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించిన ప్రయత్నాలు దారుణంగా బెడిసి కొట్టాయి. సర్కస్, కిసి కా భాయ్ కిసి కి జాన్ చిత్రాలు డిజాస్టర్‌గా మారాయి. దాంతో ఆమె పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రస్తుతం ఆమె దేవా అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఆమె ఆశలన్నీ ఆ సినిమాపైనే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











