అందుకా నిర్మాత బుజ్జి కొట్టింది!?

By Staff

Nallamlupu Srinivas
నల్లమలుపు శ్రీనివాస్ అలియాస్ బుజ్జి తనను కొట్టాడంటూ గొవర్ధన్ రెడ్డి అనే అసెస్టెంట్ డైరక్టర్ మొన్న(మంగళవారం) సాయింత్రం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంయింట్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.అయితే బుజ్జి ఎందుకు కొట్టారన్న సంగతి మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. అందులోనూ బుజ్జికి సంభందంలేని కిక్ షూటింగ్ లో ఈ సంఘటన జరగటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీనికీ కారణం చాలా సీరియస్ విషయమేనని తెలుస్తోంది.

ఆ రోజు హైదరాబాద్‌లోని బిర్లా ఎంపోరియమ్‌లో జరుగుతున్న రవితేజ చిత్రం షూటింగ్‌కు పలకరింపుగా నల్లమలుపు బుజ్జి వచ్చారు. ఇక బుజ్జిరాగానే.. గోవర్థన్ క్యాజువల్ గా వచ్చి.. సార్! మీరు తీసిన "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సూపర్‌గా ఉంది సార్.. మొన్ననే చూశానని చెప్పాడు. దీంతో బుజ్జి షాక్‌కు గురై... అసలు సినిమానే రిలీజ్ కాలేదు. నువ్వెలా చూశావని, పైరసీ ఎక్కడ జరుగుతోందని చెప్పమంటూ.. కోపంతో చేయిచేసుకున్నాడని సమాచారం. కోట్ల ఖర్ఛు పెట్టి తీసిన సినిమా రిలీజ్ కాకముందే పైరసీ కావటం ఆయనకు షాక్ గురిచేసి ఆ స్ధితిలో చేయిచేసుకున్నాడని విశ్వసనీయ సమాచారం.అలాగే ప్రస్తుతం కేసును గోవర్థన్ ఉపసంహరించుకునే దశలో ఉన్నారని తెలిసింది.

ఇక సిద్ధార్థ, తమన్నా హీరోహీరోయిన్లుగా కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించారు. డి. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకావాల్సింది. కానీ అప్పటికే సురేష్ బాబు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రాలు విడుదల కావడంతో థియేటర్లు లభించక సినిమా విడుదలను వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X