Don't Miss!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి సినిమా నుంచి చరణ్ తప్పుకోడానికి.. మహేశ్ ఎంటర్ అవడానికి కారణం ఇదే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువై పోతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు హీరోల మధ్య సత్సంబంధాలు కొనసాగుతుండడం వల్లే ఇవి సాధ్యం అవుతున్నాయి. కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఎన్నో మల్టీ స్టారర్ మూవీలు విడుదల అయ్యాయి. వాటిలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలు చేయడానికి అటు దర్శకులు, ఇటు హీరోలు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాలో మహేశ్ నటించబోతున్నాడని ఓ వార్త లీకైన విషయం తెలిసిందే. తాజాగా దీని గురించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. వివరాలు...
Recommended Video
భారీ సినిమా తర్వాత సూపర్ ప్లాన్ చేశారు
రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది ఆయన నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని భావించిన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమాను ప్లాన్ చేశారు.
మళ్లీ హై లెవెల్లోనే రాబోతున్న మెగాస్టార్
భారీ ఖర్చుతో తెరకెక్కిన ‘సైరా' తర్వాత మెగాస్టార్... కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ‘ఆచార్య' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని కూడా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్ సంస్థ సహా భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించబోతున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కథను మలుపు తిప్పే పాత్రలో అతడు కనిపించబోతున్నాడని, అది కూడా 20 నిమిషాల పాటు ఉంటుందని వార్తలు వచ్చాయి. అలాగే, ఈ సినిమాలో చరణ్.. మావోయిస్టుగా నటిస్తున్నాడని కూడా టాక్ వినిపించింది.
రామ్ చరణ్ కాదు.. మహేశ్ బాబు నటిస్తున్నాడు
ఇక, ఇటీవల ఈ సినిమాలో రామ్ చరణ్ స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును తీసుకుంటున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా కొరటాల ద్వారా అతడు విన్నాడని, అది నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా సూపర్ కాంబినేషన్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
చరణ్ తప్పుకోడానికి.. మహేశ్ ఎంట్రీకి కారణం ఇదే
ఈ సినిమా నుంచి రామ్ చరణ్ తప్పుకోడానికి.. అలాగే మహేశ్ బాబు ఎంటర్ అవడానికి గల కారణం ఇదేనంటూ ఓ వార్త తాజాగా లీక్ అయింది. దీని ప్రకారం.. రామ్ చరణ్ RRR కోసం మరిన్ని డేట్స్ కేటాయించాల్సి ఉంది. అందుకే ఇందులో చేయడం కుదరదట. మహేశ్ బాబునే తీసుకోవడానికి కారణం మాత్రం కొరటాల శివతో ఆయనకు ఉన్న రిలేషన్ అని అంటున్నారు.
చిరంజీవి రావడం కూడా ఒక కారణమే
అంతేకాదు, మహేశ్ బాబు ఈ సినిమాలో చేయడానికి మరో కారణం కూడా ఉందట. ఈ సంక్రాంతికి అతడు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా విడుదలైంది. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ కృతజ్ఞతతోనే సూపర్ స్టార్.. చిరంజీవి సినిమాలో నటించడానికి ఒప్పుకుని ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.