Rambha: టాలీవుడ్ సూపర్ స్టార్‌పై రంభకు కోపం ఎందుకు? ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎందుకు నటించలేదంటే?

సాధారణంగా ఇండస్ట్రీలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది వాటిని లైట్ తీసుకుంటారు.. ఇంకొంతమంది వాటిని సీరియస్ గా తీసుకుంటారు. ఈ గొడవల వలన చాలా ఏళ్ళు వాళ్ళు మాట్లాడుకోరు కూడా. అంతెందుకు జయప్రద, శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరినీ చూస్తే వారు అక్కాచెల్లెళ్లు అని అనుకోకుండా మానరు. కానీ, బయట మాత్రం వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంట.

శ్రీదేవి చనిపోయేవరకు కూడా జయప్రదతో మాట్లాడింది లేదు అంట. దానికి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు. అలాగే హాట్ బ్యూటీ రంభ.. ఒక చిన్న గొడవ కారణంగా అక్కినేని నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదట. అప్పట్లో నాగ్ తో నటించడానికి హీరోయిన్స్ క్యూ కట్టేవారు. రమ్మకృష్ణ, సౌందర్య, రోజా, మీనా.. ఆ తరువాత శ్రీయా, ఆర్తీ ఆగర్వాల్, నయనతార, ఇలా అందరూ ఆయనతో స్క్రీన్ ను షేర్ చేసుకున్నవారే.

కానీ, ఎన్నోసార్లు నాగ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా రంభ మాత్రం నో చెప్పిందట. తెలుగు, హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో అందరి హీరోలతో నటించిన రంభ.. నాగ్ కు ఓ చెప్పడానికి కారణం.. ఒక చిన్న సంఘటన అని చెప్పుకొస్తున్నారు. అదేటంటే.. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ లో నటించగా.. రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు.

అయితే రమ్యకృష్ణ కంటే ముందుగా ఆ పాత్ర కోసం రంభని అనుకున్నాడట డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. ఆమెతో మాట్లాడి డేట్స్ కూడా ఫైనల్ చేశారట. కానీ, నాగ్ మాత్రం తనకు రమ్యకృష్ణనే కావాలని పట్టుబట్టడంతో హీరో మాటే వేదం అనుకొనే మేకర్స్ తప్పనిసరి పరిస్థితిలో రంభని తప్పించి రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆరోజుల్లోనే సుమారుగా పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి షేక్ చేసింది.

ఇక నాగ్.. తనను రిజెక్ట్ చేశాడని తెలుసుకున్న రంభ.. ఆయనపై కోపం పెంచుకుందట. ఆ తరువాత నాగ్ పక్కన నటించే అవకాశం వచ్చినా.. తనను రిజెక్ట్ చేసిన హీరోతో చేయనని తెగేసి చెప్పేసింది అంట. అందుకే ఇప్పటివరకు కూడా నాగ్ తో రంభ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కోరిక మేరకు అదే సినిమాలో ఒక పాటలో మాత్రం అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది. అదే కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్.

ఇందులో రంభ, ఆమని, ఇంద్రజ నాగార్జునతో పాటు స్టెప్స్ వేశారు. అది కూడా తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ మాట కాదనలేక చేసినట్లు ఆ తరువాత రంభ చెప్పిందట. రంభను పరిచయం చేసింది ఈవీవీనే అన్న విషయం తెల్సిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ద్వారానే రంభ పరిచయమైంది.

Rambha

మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న రంభ ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది. పెళ్లి తరువాత అడపాదడపా కనిపించిన రంభ ఇప్పుడు పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యింది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరి అన్ని కలిసి వస్తే ఈ హాట్ బ్యూటీ మళ్లీ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X