పవన్ సినిమా షూటింగ్ ఆపేసి మళ్ళీ అమెరికాకి రానా.. అసలేమయింది?

యంగ్ హీరో రానా ఆకస్మికంగా అమెరికా వెళ్ళడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్న ఆయన షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి అమెరికా వెళ్లడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఆకస్మిక పర్యటన

ఆకస్మిక పర్యటన


టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ గా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా ఆకస్మిక అమెరికా పర్యటన ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. అయితే రానా వ్యక్తిగత పనిమీద అమెరికా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సినిమాలకు సంబంధించిన షూటింగ్ కోసం అయితే వెళ్లలేదని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్లాన్ కూడా చేసిన పర్యటన కాదని అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు.

అనారోగ్య పరిస్థితి?

అనారోగ్య పరిస్థితి?

నిజానికి తనకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని రానా స్వయంగా గతంలో ఒప్పుకున్నాడు. అమెరికా వెళ్లింది కూడా గతంలో ట్రీట్మెంట్ కోసమేనని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.. దీంతో ఇప్పుడు పుకారు రాయుళ్ళు రానా అమెరికా మళ్ళీ వెళ్ళింది చికిత్స కోసమే అనే పుకార్లు లేపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ అయితే లేదు.

షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ

షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ

ప్రస్తుతానికి రానా - పవన్ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సీన్లు షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సినిమా షూట్ ఆపేసి మరీ అమెరికా పయనం అయినట్టు చెబుతున్నారు. అయితే ఎందుకు అనేది మాత్రం తెలియడం లేదు.

అమెరికా ఎందుకు

అమెరికా ఎందుకు

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా కాకుండా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రియమణి లాంటి సీనియర్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్న విరాటపర్వం సినిమాకి సంబంధించి కూడా కొంత ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉందని అంటున్నారు.. అయితే ఈ రెండు షూటింగ్స్ పక్కనపెట్టి మరీ రానా అమెరికా వెళ్లడం ఎందుకు అనే కోణంలో చర్చ జరుగుతోంది.

మిహీకాతో కలిసి వెళ్ళారా

మిహీకాతో కలిసి వెళ్ళారా

అయితే రానా 2020లో మంచి కరోనా మూమెంట్ లో తన గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ ను వివాహం చేసుకున్నారు.. వివాహం జరిగినప్పటి నుంచి కరోనా కారణంగా ఈ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళింది లేదు. బహుశా వీరిద్దరూ కలిసి అమెరికా వెళ్ళారేమో అనే ప్రచారం కూడా జరుగుతోంది దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు.

అరణ్య రిలీజ్ అయినా

అరణ్య రిలీజ్ అయినా

ఇక సినిమాల విషయానికి వస్తే రానా తెలుగు భాషలో కాక తమిళ హిందీ భాషల్లో కూడా అనేక పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు. చివరిగా ఆయన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించారు ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన అరణ్య సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయింది.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
భారీ అంచనాలు

భారీ అంచనాలు

అయితే ఈ సినిమా మాత్రం అనుకున్నంత మేర అంచనాలను అందుకోలేకపోయింది. అయితే రానా ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమా అలాగే విరాటపర్వం సినిమా మీద కూడా భారీగా బాజ్ ఏర్పడిందని మాత్రం చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలతో రానా ఖచ్చితంగా హిట్స్ అందుకుంటాడు అని భావిస్తున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X