Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వర్మతో రెండో సినిమా...మంచు విష్ణు మెగా స్కెచ్
అయితే వర్మతో చేస్తే ఓ బెనిఫిట్ ఉంటుంది... అదే మంచు విష్ణుని ఎట్రాక్ట్ చేసి ఉండవచ్చు అంటున్నారు. వర్మతో చేస్తే అతి తక్కువ సమయంలో, అతి తక్కవ బడ్జెట్ తో క్వాలిటీ చిత్రం తెరకెక్కిస్తారు. అయితే అందులో రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ సాధారణంగా ఉండవు. హాలీవుడ్ సినిమాల తరహాలో కథను...కథగా స్ట్రైయిగా చెప్పుకుంటూ వెళ్తూంటారు. ట్రెండ్ ని పట్టించుకోరు. అదే రౌడీని సైతం ఇబ్బందిగా మార్చేసి భాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ రిజల్ట్ ని ఇచ్చింది. కానీ నిర్మాతగా,ఆర్టిస్టుగా వర్మతో చేయటం సుఖం అనిపిస్తుంది. బడ్జెట్ కంట్రోలు, డేట్స్ తక్కువ అనేవి వారిని ఎట్రాక్ట్ చేస్తాయి. మంచు విష్ణులో ఓ నిర్మాత,నటుడు ఇద్దరూ ఉండటంతో వర్మతో కంటిన్యూ అవుతున్నాడంటున్నారు. ఇక వర్మ పేరు చెప్పి కొద్దో గొప్పో బిజినెస్, ఓపినింగ్స్ ఎలాగో ఉంటాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా మంచు విష్ణు కి కామెడీ హీరో అనే ముద్ర నుంచి బయిటపడాలనే కోరిక ఉందంటున్నారు. అయితే అతనితో పనిచేసేందుకు ఫామ్ లో ఉన్న యాక్షన్ దర్శకులు ఎవరూ ముందుకు రావటం లేదు. బడ్జెట్ లు వర్కవుట్ కావని ఆగుతున్నారు. అదే వర్మ అయితే దర్శకుడుగా గొప్పవాడు...యాక్షన్ చిత్రాలు తీస్తానంటున్నాడు. అదీ తక్కువ బడ్జెట్ లో కాబట్టే ఆయనతో ముందుకు వెళ్తున్నాడు అంటున్నారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతోంది. రామ్‌గోపాల్‌వర్మ దర్శకుడు. ఏవీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. విష్ణుపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ''ప్రస్తుతం మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. 'రౌడీ' తర్వాత నేను, వర్మ కలిసి చేస్తున్న చిత్రమిది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాము''అన్నారు మంచు విష్ణు. ఈ సినిమాకి 'పన్నెండు' అనే పేరు పరిశీలనలో ఉంది.