స్క్రిప్టు నచ్చకపోయినా పవన్ ..మాట కోసం ఓకే చేసారా
వివరాల్లోకి వెళితే..రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమా తీసిన సంపత్ నందికి అవకాశమిస్తానని పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశారు. తర్వాత సంపత్ వినిపించిన స్టోరీ లైన్ పవన్ కు నచ్చింది. దీన్ని డెవలప్ చేసి తీసుకురమ్మన్నాడు. పూర్తిగా కథ తయారయిన తర్వాత పవన్ కు నచ్చలేదట. మరికొన్ని నెలలు కూర్చున్నా పవన్ కు నచ్చే స్క్రిప్ట్ చేయలేకపోయాట.
అప్పటికే సంపత్ నందీ ఆ స్క్రిప్టుపై సంవత్సరం పైగా పనిచేసారు. అతడి నిబద్దతపై నమ్మకముంచిన పవన్ కళ్యాణ్ అతడికి మరో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అదే 'గబ్బర్ సింగ్-2'. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ టీమ్ స్క్రిప్ట్ సమకూర్చింది. పవన్ మంచి మనసుకు ఇంతకన్నా రుజువేం కావాలి అంటున్నారు ఆయన అభిమానులు.
ఇక సూపర్ హిట్ 'గబ్బర్ సింగ్-2' డైరెక్షన్ ఛాన్స్ ఎవరికీ వస్తుందనే దానిపై అన్నివర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ అవకాశం సంపత్ నందికి దక్కిందనగానే అందరూ షాక్ కి లోనయ్యారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్'ను తెరకెక్కించిన హరీష్ శంకర్ కే మళ్లీ ఛాన్స్ ఇస్తారని ఆశించారు. లేదా కోన వెంకట్ అనుకున్నారు. అయితే సంపత్ నందికి ఇచ్చిన మాట కోసమే పవన్ కళ్యాణ్ అతడికి అవకాశం ఇచ్చాడు. అతడు చెప్పిన కథ నచ్చక పోయినప్పటికీ సంపత్ కి దర్శకత్వ బాధ్యతలు కట్టబెట్టాడనేది ఇప్పటి వార్త.


Click it and Unblock the Notifications












