టాలీవుడ్ హీరోలతో రొమాన్స్‌కు సమంత నో... వారికి మాత్రమే.. ఎందుకో తెలుసా?

కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న నటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బోల్డ్ ఫోటోల ద్వారా తరచూ సందడి చేసే సామ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించనని చెప్పినట్లు రుమార్లు విన్పిస్తున్నాయి.

యశోద సినిమా సమయంలో మయోసైటిస్‌తో బాధపడుతున్న చెప్పిన సమంత ఖుషీ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకుంది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.మరి ఆమె ఈ షాకింగ్ నిర్ణయానికి కారణం ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

Reason Behind why Samantha won t accept Telugu Star Hero Films

కానీ రీ ఎంట్రీ తరువాత సమంతకు తెలుగు సినిమా అవకాశాలు రాలేదని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఏడాది పాటు విరామం తీసుకుంటే ఆ గ్యాప్‌లో చాలా మంది కొత్త నటీమణులు పుట్టుకొస్తారు. సమంత విషయంలో కూడా అలాగే జరిగింది. అందుకే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు కూడా తక్కువే వస్తున్నాయి అంటున్నారు.

ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోంది సామ్. అలాగే ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లోని తదుపరి చిత్రంలో సామ్ కథానాయిక అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు సినిమా చేయాలనుకున్నా తెలుగు స్టార్ హీరోలెవరూ సపోర్ట్ చేయలేదని సమంత అన్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ ఓ పెద్ద నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

Reason Behind why Samantha won t accept Telugu Star Hero Films

తెలుగులో స్టార్ హీరోలతో నటించనని సామ్ సన్నిహితులతో చెప్పిందట. సమంత కన్ను ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపైనే ఉంది. తెలుగులో కొన్ని ఆఫర్లు వస్తున్నా అందుకే ఒప్పుకోవడం లేదట. అయితే సమంత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? వేచి చూడాల్సిందే.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యవహరిస్తున్న తీరు, నిజ జీవితంలో ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎప్పుడూ జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చినట్లుగా నడిపిస్తున్న సామ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ బోల్డ్ ఫోటోను షేర్ చేస్తూ వార్తల్లోకెక్కింది.

గత కొన్ని నెలలుగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత తన సినీ కెరీర్‌కు ఏడాది పాటు విరామం తీసుకుంది. వ్యాధికి చికిత్స పొంది కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ఈ బ్యూటీ చివరిసారిగా తెలుగులో ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే సినిమా అంగీకరించలేదు. ఇప్పుడు కొత్త సినిమాకు సైన్ చేసింది .

Reason Behind why Samantha won t accept Telugu Star Hero Films

సమంత త్వరలోనే వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఇది అమెరికన్ సిరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్‌కి రీమేక్. రాజ్ అండ్ డీకే సిటాడెల్ కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. అంతే కాకుండా త్వరలో సమంత బాలీవుడ్ లోకి అతి త్వరలోనే అడుగు పెట్టనుందని తెలుస్తోంది. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై విష్ణువర్ధన్ సినిమా కోసం సమంత హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.

సామ్ బర్త్ డే రోజున స్పెషల్ మూవీ రివీల్ కావడం అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తోంది. మా ఇంటి బంగారం సినిమా పోస్టర్‌లో సమంత గృహిణిగా చీర కట్టుకుని, చేతిలో రక్తపు మరకతో డబుల్ బ్యారల్ గన్ పట్టుకుని వెరైటీ లుక్‌లో కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X