twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సాహో' వాయిదా వెనుక అసలు కారణం ఇదే!

    |

    టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ సినిమా 'సాహో' ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుందని అందరూ ఆతృతగా ఉన్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే సాహో విడుదల వాయిదా!. చిత్రయూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన రానప్పటికీ గుణ 369 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలతో ఇది కన్ఫర్మ్ అయింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. అయితే సాహో పోస్ట్ పోన్ వెనుక అసలు కారణాలేంటనే విషయమై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ వినిపిస్తోంది.

    సాహో పోస్ట్ పోన్ అనే మాటల వినగానే వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ పూర్తికాలేదేమో.. అందుకే సినిమాను వాయిదా వేశారు కావచ్చు అని భావించారంతా. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనుక అదికూడా ఓ కారణమే అయినప్పటీకీ అసలు కారణం అదికాదని తెలుస్తోంది. నాలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను బాలీవుడ్ లో టి సిరీస్ యాజమాన్యం భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆగస్టు 15 వ తేదీన బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్, బట్లా హౌస్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజే రిలీజ్ చేస్తే థియేటర్స్ సమస్య అవుతాయాయేమో అని భావించి వెనక్కు తగ్గారట. బట్లా సినిమాను టి సిరీస్ నిర్మించింది. మరోవైపు సాహో సినిమాను కూడా టిసిరీస్ రిలీజ్ చేస్తోంది. సో ఈ రెండు సినిమాలకు క్లాష్ రావద్దనే ఆలోచన తోనే సాహో సినిమాను వాయిదా వేసినట్లు టాక్ వినిపిస్తోంది.

    Reason Behing Saaho Postpone

    యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, చుంకీ పాండే లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూపు సాహో పై ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి హై రేంజ్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది చిత్రయూనిట్. ఆగస్టు ౩౦ వ తేదీన భారీ అంచనాల నడుమ సాహో విడుదల కానుందని తెలుస్తోంది.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting major part is successfully completed. present saaho team busy with post production works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X