పార్టీలంటేనే అలర్జీ - సదా
'జయం' చిత్రంతో పరిచయమైన నాయిక సదా. తొలి చిత్రం మంచి విజయం సాధించినా, మంచి నటి అనిపించుకున్నా ఎందుకో ఆ తర్వాత సదాకు ఆ రేంజ్ లో బ్రేక్ ఇచ్చే చిత్రాలు రాలేదు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన "అపరిచితుడు" సినిమాలో నటించిన సదాకు, ఆ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని.. సినీ కెరీర్ మారిపోతుందని సినీ పండితులు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించినా సదాకు ఎందుకో పెద్దగా విజయాలు దక్కలేదు. తాజాగా తెలుగులో ఆమె "అ..ఆ.. ఇ.. ఈ.." అనే చిత్రంలో నటించింది. దాదాపు ఏడాదిపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు.
తనకు సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంపై ఇటీవలే సదా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తనకు సినిమాలు తక్కువగా రావడానికి కారణం రాత్రి పూట పార్టీలకు వెళ్లకపోవడమేనని చెప్పింది.అలాగే పబ్‌లలో డ్యాన్స్‌లు చేయడం కూడా సదాకు చిరాకేనని ఆమె సన్నిహితులు అంటున్నారు.
మరి సినీరంగంలోకి అడుగుపెట్టాక ఇవన్నీ సాధారణమే కదా..! అని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కానీ సదాకేమో..! రాత్రి పార్టీలంటేనే అలర్జీ అట. ఇలాగయితే ఎలాగమ్మా!!


Click it and Unblock the Notifications











