మహేష్ ఐటి రైడ్స్ వెనక ఆ ప్యామిలీ!?
మహేష్ బాబు ఇంటిపై రీసెంట్ గా ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల వెనక అల్లు అరవింద్ ఫ్యామిలీ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి రూమర్స్ లాజిక్ లేకుండా అంతటా ప్రయాణిస్తున్నాయి. ఫిల్మ్ సర్కిల్స్ లో గత రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మగధీర చిత్రం రికార్డులు బ్రద్దలు కొట్టినప్పుడు రాని ఐటి అధికారులు ఇప్పుడు దూకుడు నిర్మాతలుపైనా,మహేష్ బాబు పైనా దాడి చేయటం వెనక తెలియని కారణం ఉందని అంటూ అల్లు ఫ్యామిలీ వైపే వేలెత్తి చూపుతున్నారు. అలాగే కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉండటం,చిరంజీవి ఆ పార్టీతో కలవటం కూడా ఈ రూమర్స్ కు కలిపి రీజన్ గా చూపెడుతూ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ రూమర్స్ ఇండస్ట్ర్రీలో ఉండే మంచి వాతావరణాన్ని చెడగొడతాయని కొందరు ఆందోళనపడుతున్నారు. ఇప్పటికే ఈ రికార్డుల గొడవతో మహేష్ బాబు ఫ్యాన్స్ కీ ,మెగా ఫ్యాన్స్ కీ మధ్య గొడవలు జరిగాయి..అంతేగాక ట్విట్టర్ లో అల్లు శిరీష్ సైతం దూకుడు కలెక్షన్స్ పై పలువిధాలుగా సవాళ్లు విసిరారు. ఇప్పుడీ రూమర్ వీరి మధ్య అగాధాన్ని పెంచి పోషిస్తాయంటున్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ పై దూకుడు నిర్మాతలు స్వయంగా వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చాకే సర్దుమణిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రూమర్ పై ఎవరు ముందుకు వచ్చి మాట్లాడతారో చూడాలి.


Click it and Unblock the Notifications











