అయ్యో...నిజమా?: ‘చిన్నదాన నీకోసం’ రిలీజ్ ఆలస్య కారణం

By Srikanya

హైదరాబాద్: నితిన్‌ హీరోగా నటించిన చిత్రం ‘చిన్నదాన నీ కోసం'. విక్రమ్‌గౌడ్‌ సమర్పిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎ.కరుణాకరన్‌ దర్శకుడు. మిస్తి హీరోయిన్. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల అవుతోంది. మొదట 19న అనుకున్నది 24 కి వాయిదా పడటానికి కు కారణం తెలియవచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల వాయిదా పడటానికి కారణం...ఎడిటర్ ప్రవీణ్ పూడి కి చెందిన బంధువులు మరణించటం అని తెలుస్తోంది. దాంతో బ్రేక్ తీసుకున్న ప్రవీణ్ ..ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని తిరిగి వచ్చి వర్క్ లో పాల్గొని పూర్తి చేసే సరికి లేట్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ప్రాజెక్టు బాగా వచ్చిందని ఖచ్చితంగా గుండెజారి గల్లంతైంది రేంజిలో హిట్ కొడతారని చెప్పుతున్నారు.

నితిన్ మాట్లాడుతూ... ‘‘తొలిప్రేమను చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నా. కరుణాకరన్‌తో పనిచేయాలని అప్పటి నుంచే ఉండేది. ఈ సినిమా కంప్లీట్‌గా ఆయన స్టైల్‌లోనే ఉంటుంది. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ. నా పెర్ఫార్మెన్స్‌ వైవిధ్యంగా అనిపిస్తుంది. అనూప్‌ మంచి సంగీతాన్నిచ్చారు'' అని నితిన్‌ చెప్పారు.

ఈ సినిమాతో తమ సంస్థకు హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమని నిఖితారెడ్డి అన్నారు. మంచి పాటలు కుదిరాయని, పిక్చరైజేషన్‌ కూడా చక్కగా ఉందని అనూప్‌ తెలిపారు. అందరికీ నచ్చే లవ్‌స్టోరీ అవుతుందని దర్శకుడు కరుణాకరన్‌ చెప్పారు.

Reason for Niti's Chinnadana Nee Kosam delay

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే హార్ట్ ఎటాక్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు నితిన్. కెరీర్‌లో మంచి జోరుమీదున్న ఆయన తాజాగా మరో విజయంపై కన్నేశారు. ఆయన ప్రస్తుతం కరుణాకరణ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇష్క్ చిత్రంలో ప్రజాదరణ పొందిన గీతంలోని చరణాన్ని టైటిల్‌గా ఎంపిక చేసుకోవడం విశేషం. నవ్యమైన కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం కరుణాకరణ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్ కు సిద్దంగా ఉన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చుతున్నారు.

శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్‌, సితార, మధునందన్‌ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X