ఆ దర్శకుడితో నాని సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనా!
నాని ప్రస్తుతం మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. నాగార్జున ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నానికి విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నచ్చకపోవడం వల్లే సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను నాని పూర్తిగా లైట్ తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

వైజయంతి మూవీస్ లో నాని సినిమా
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాని ప్రస్తుతం మల్టి స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. నాగార్జున ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

హలో డైరెక్టర్ సినిమా
హలో సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. నానికి విక్రమ్ కుమార్ చెప్పిన పాయింట్ నచ్చకపోవడం వల్లే సినిమా ఆగిపోయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను నాని పూర్తిగా లైట్ తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

ఎఫెక్ట్ పడిందా?
నేచురల్ స్టార్ నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరో, హీరోయిన్స్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన సినిమా కృష్ణార్జున యుద్ధం గత మూడు వారాల క్రితం విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకోసం నాని తన తదుపరి సినిమాలపై జాగ్రత్త చూపిస్తున్నాడు. కథ ఏమాత్రం సంతృప్తి కలగకపోయినా సినిమా చెయ్యనని చెబుతున్నట్లు సమాచారం.

నాని మూవీపై క్లారిటి లేదు
నాని చేతిలో ప్రస్తుతం ఉన్నది ఒక్క సినిమా మాత్రమే. నాగార్జునతో కలిసి నటిస్తోన్న సినిమా తప్పా ఏ సినిమా ఒప్పుకోలేదు. అవసరాల శ్రీనివాస్ తో సినిమా ఉంటుంది అన్నారు కాని క్లారిటి లేదు. మరి నాని తరువాతి సినిమా ఎవరితో చేస్తాడన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications











