బన్నీ ఆ మాట ఎందుకన్నాడు.. త్రివిక్రంతో సినిమా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. విక్రమ్ కుమార్ వినిపించిన కథ నచ్చక పక్కనే పెట్టేసిన బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని లైన్ లో పెట్టాడు. ఈ కాంబినేషన్ విషయంలో కూడా సందిగ్దత కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తరువాత అభిమానులకు ఒక మంచి చిత్రం అందించాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. దీనితో తనకు పక్కాగా హిట్టిచ్చే కథ, దర్శకుడి కోసం బన్నీ అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ మాటకు కారణం
ఇటీవల టాక్సీవాలా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతున్న సందర్భంలో అభిమానులు నెక్స్ట్ మూవీ ప్రకటించాలని కోరారు. దాని గురించి మాట్లాడవద్దు అంటూ బన్నీ దాటవేశాడు. అంటే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీ రీమేక్
త్రివిక్రమ్ శ్రీనివాస్ సోను కె టిటు కి స్వీటీ అనే హిందీ చిత్ర కథ ఆధారంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథ విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిగా ఉండనే వార్తలువస్తున్నాయి. మరోవైపు నిర్మాతలు ఇంకా ఫిక్స్ కాలేదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణాలవాలనే బన్నీ కొత్త చిత్రం డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.

మరో హీరోతో
అల్లు అర్జున్ కి ఈ కథ పూర్తి స్థాయిలో నచ్చకపోతే త్రివిక్రమ్ మరో హీరోతో చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇలాంటి సందేహాలన్నీ ఉన్నందువలనే అధికారికంగా ప్రకటన రావడం లేదట. అల్లు అర్జున్ ఇటీవల కేరళ వెళ్లిన సందర్భంగా సరికొత్త గెటప్ లో కనిపించాడు. ఈ లుక్ కొత్త చిత్రం కోసమే అని అభిమానులు సంబరపడ్డారు. కానీ టాక్సీవాలా ప్రీరిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన వ్యాఖ్య వారి ఆశలు నీరు గారినట్లు అయింది.

సరైనోడు తరువాత
బోయపాటి దర్శత్వంలో బన్నీ నటించిన సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత డీజేలో నటించాడు. డీజే యావరేజ్ గా నిలిచింది. చివరగా నటించిన నా పేరు సూర్య అభిమానులని పూర్తిగా నిరాశ పరిచింది. అందుకే తదుపరి చిత్రం విషయంలో బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications











