రష్మిక, రక్షిత్ బ్రేకప్ కారణాలు ఇవే.. అతడే వారిని విడదీశాడట!

కన్నడ తారలు రక్షిత్‌శెట్టి, రష్మిక్ మందన్న బ్రేకప్ వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. వీరి నిశ్చితార్థం రద్దు కావడం వెనుక చాలా కారణాలు వినిపించాయి. మీడియాలో విభిన్న కథనాలు వినిపించడంతో రష్మిక తల్లి సుమన్ మందన్న ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి కూడా స్పందించి తగిన వివరణ ఇచ్చారు. అయితే రష్మిక మందన్న బ్రేకప్‌పై పలు రకాల కారణాలు మీడియాలో వినిపిస్తున్నాయి. అవేమిటంటే..

 రష్మిక కెరీర్ విషయంలో

రష్మిక కెరీర్ విషయంలో

రష్మికతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కెరీర్ విషయంలో ఆమెకు పూర్తిగా రక్షిత్ శెట్టి స్వేచ్ఛను ఇచ్చారు. అయితే స్క్రిప్టు ఎంపిక విషయంలో రక్షిత్ చొరవ తీసుకొన్నారట. ఆయన సెలక్షన్ చేసిన స్క్రిప్టులను మాత్రమే చేయాలని రష్మిక సూచించాడట. అలాగే ఆమె ఛలో, గీత గోవిందం చిత్రాలు చేశారట. రక్షిత్ సూచన మేరకు కొన్ని మంచి సినిమాలు ఆమె నిరాకరించడం వారి మధ్య విభేదాలకు కారణంగా మారిందట.

మేనేజర్‌తో సమస్యలు

మేనేజర్‌తో సమస్యలు

తెలుగులో బిజీగా కావడంతో రష్మికకు స్వయంగా మేనేజర్‌ను రక్షిత్ ఏర్పాటు చేశారట. మేనేజర్ తీరు రష్మిక నచ్చకపోవడం, రక్షిత్ అతనికే మద్దతు తెలుపడం వారి మధ్య ఎడబాటును మరింత పెంచిందట. మేనేజర్ ప్రవర్తనతో రష్మిక మనస్తాపానికి గురయ్యారట.

మేనేజర్ తొలగింపు

మేనేజర్ తొలగింపు

ఇక మేనేజర్ విషయం రష్మిక, రక్షిత్ శెట్టి విడిపోవడానికి ప్రధానమైన కారణంగా మారిందట. రక్షిత్ నియమించిన మేనేజర్‌ను రష్మిక తొలగించడంతో వారి మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరిందట. దాంతో రష్మిక, రక్షిత్ మధ్య పెరిగిందంట. గత కొద్దినెలలుగా వారి మధ్య మాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయట.

సామరస్య పూర్వకంగా రద్దు

సామరస్య పూర్వకంగా రద్దు

రక్షిత్, రష్మికల మధ్య అభిప్రాయ బేధాలు ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిని కలిపేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారట. వారి ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో సామరస్య పూర్వకంగా విడిపోవాలని, జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేయాలని నిర్ణయించారట.

రష్మిక తల్లి వివరణ

రష్మిక తల్లి వివరణ

రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి ముగింపు పలికేందుకు వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. రష్మిక తల్లి సుమన్ మందన్న నిశ్చితార్థం బ్రేకప్ జరిగిన విషయం నిజమే. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాం అని ఆమె వెల్లడించడం తెలిసిందే.

రక్షిత్ శెట్టి స్పందన

రక్షిత్ శెట్టి స్పందన

రష్మికతో బ్రేకప్‌పై రక్షిత్ కూడా స్పందించాడు. విడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఏదో కారణాన్ని ఊహించుకొని రష్మికపై ఓ అభిప్రాయానికి రావొద్దు. ఆమె ప్రశాంతంగా బ్రతకనివ్వండి. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. నిజమేంటో తెలుస్తుంది అని రక్షిత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X