చిరు మూవీ నుంచి త్రిష అవుట్.. ఆమె ట్వీట్‌లో అంత అర్థముందా.. అదే కారణమంటూ వైరల్
చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. మూవీ టైటిల్‌ను చిరంజీవి ఓ ఈవెంట్‌లో పాల్గొని నోరు జారడంతో అందరికీ తెలిసిపోయింది. అది కాసేపు పక్కన బెడితే నిన్నటి నుంచి ఆచార్యపై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు త్రిష ప్రకటించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. అసలు త్రిష ఎందుకు తప్పుకుంది? ఆమె చేసిన ట్వీట్‌కు అర్థమేంటి? ఇలా ఎన్నో రకాల ప్రశ్శలు అలానే మిగిలిపోయాయి. ఓ సారి వాటి సంగతేంటో చూద్దాం.
Recommended Video


తప్పుకున్న త్రిష..
చిరంజీవి సినిమా నుంచి తప్పుకొంటున్నట్లుగా పేర్కొంటూ.. ‘కొన్ని సార్లు అన్ని మనం అనుకున్నట్లే జరగవు.. మొదటగా చెప్పినదానికి, చర్చలు జరిపిన దానికి తగ్గట్టే అన్ని జరగవు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా.. చిత్రయూనిట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా..త్వరలోనే ఓ మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాన'ని త్రిష ట్వీట్ చేసింది.

చెప్పిన స్క్రిప్ట్ కాకపోవడంతో..
త్రిష చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే కొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. మొదట చెప్పిన దానికి , చర్చలు జరిపినట్టుగా కథ లేదని, చాలా మార్పులు చేర్పులు జరిగాయని అర్థమవుతున్నాయి. అందులో భాగంగా త్రిష పాత్ర చాలా మట్టుకు తగ్గినట్టు తెలుస్తోంది.

రామ్ చరణ్ ఎంట్రీతో..
మొదటగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు అంత ప్రాధాన్యం లేకపోయినా, రామ్ చరణ్ ఎంట్రీతో కథా స్వరూపమే మారిపోయింది. రామ్ చరణ్‌కు కూడా పాటలు, ఫైట్స్ ఉండటంతో మరో హీరోయిన్ కూడా కావాల్సి వచ్చింది. అయితే ఆ రెండో హీరోయిన్ వస్తే.. త్రిషకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుందని తప్పుకుందని టాక్.

కథలో భారీ మార్పులు..
రామ్ చరణ్ లేదా మహేష్ బాబు అంటూ ఇంత కాలం తాత్సరం చేసింది యూనిట్. చివరగా చరణ్ అయితేనే అన్ని విషయాలు కలిసి వస్తాయని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ పాత్రకు అమాంతం ప్రాధాన్యత పెరిగింది. దీంతో త్రిష పాత్ర తగ్గింది. రెండో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇన్నింటి మధ్య తానుండలేని క్రియేటివ్ డిఫరెన్సెన్ అని బయటకు వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. త్రిష వదిలిన పాత్ర కాజల్‌కు దక్కిందని టాక్.


Click it and Unblock the Notifications











