Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మార్చిలో ఎంగేజ్మెంట్... ఏప్రిల్‌లో పెళ్లి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు పెళ్లి పీటలెక్కేశారు. ఇక ఎన్నో ఏళ్లుగా రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చూసుకుంటే చూడాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఆయన పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు బయటకు వస్తునే ఉన్నాయి. ఇక కృష్ణం రాజు భార్య శ్యామల దేవి 2024లో ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పింది. ఇక ఈ పెళ్లిపై మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...

ఇండస్ట్రీలో హీరోలంతా ఓ ఇంటి వారయిపోతున్నారు. యంగ్ హీరోలు శర్వానంద్, నితిన్, వరుణ్ తేజ్ ఇలా చాలా మంది హీరోలు ఏడడుగులు వేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో మాత్రం నిజం లేకుండా పోతున్నాయి. అయితే గత ఏడాది కృష్ణం రాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ప్రభాస్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చింది.

Rebal Star Prabhas Marriage Rumors goes viral in social media again

అయితే ప్రభాస్ పెళ్లి.. ఎవరితో ఎప్పుడు అనేది క్లారిటీగా చెప్పలేదు. ఇక అప్పటి నుంచి ప్రభాస్ పెళ్లి ఏదో ఒక వార్త బయటకు వస్తునే ఉంది. ప్రభాస్ బంధువుల అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ... ఇప్పుడు ప్రభాస్ పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ గా మారాయి.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఆశపడుతున్న సంగతి తెలిసిందే. ఆరడుగుల అందగాడు.. ఇప్పటికే 40ఏళ్లు దాటాయి.. ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చూడాలని చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి గురించి రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఓ న్యూస్ లీక్ అయిందని సమాచారం. ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి చేయాలని భారించారట. ఇక ప్రభాస్ నిశ్చితార్థం, పెళ్లి డేట్లు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

మార్చిలో 17వ తేదీన ప్రభాస్ నిశ్చితార్ధం చేసుకుంటారని... ఏప్రిల్ 21వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమ్మాయి ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేదు. బట్ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటికే ప్రభాస్ హిట్ కొట్టాడు... ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అయితే చాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

Rebal Star Prabhas Marriage Rumors goes viral in social media again

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయిన లుక్ మాత్రం ఆకట్టుకుంటుంది. దీనితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ఏడి 2898 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X