twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రెబల్‌' ఫస్ట్ లుక్ టీజర్, ఆడియో రిలీజ్ డేట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రభాస్ తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్‌'. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఆగస్ట్ 2 న విడుదల చేయనున్నారని సమాచారం. అళాగే ఆడియోని ఆగస్టు 18న,సినిమాని సెప్టెంబర్ సెకండ్ వీక్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా, దీక్షాసేథ్‌ చేస్తున్నారు. కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల కోసం రూ.2 కోట్ల వ్యయమైంది. ప్రత్యేకంగా కాళీమాత విగ్రహాన్ని తయారుచేయించారు. స్వరాల బాధ్యతను కూడా లారెన్స్‌ తీసుకొన్నారు.

    దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... "రెబల్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం. అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా ఎగరేస్తే పులి కూడా వెనక్కు పరుగెడుతుంది. మా హీరో నమ్మిన సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే" అన్నారు.

    అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. "లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్‌గా ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా తిరగబడ్డ ఆ పోరు బిడ్డ ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి? తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం. అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు" అన్నారు.

    ప్రభాస్ ఈ చిత్రం గురించి చెపుతూ.. "షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా" అని ప్రభాస్ చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

    English summary
    Rebel - starring Prabhas-Tamanna and Deeksha Seth is its final leg of production. Meanwhile the makers are planning to release the first look teaser on 2nd of August- and the music is expected to sound on 18th of August and finally the film will hit the screens in the month of September. Director Lawrence himself composing the music for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X