Prabhas: సీక్రెట్‌గా ఇంటి వాడైన ప్రభాస్.. లేట్ అయినా మంచి పనే చేశాడుగా!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్టామినా భారీగా పెరిగింది. అదే సమయంలో ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా మారారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా అతడు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించే సినిమాలు చేస్తున్నాడు.
ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో సత్తా చాటిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ సీక్రెట్‌గా ఓ ఇంటి వాడు అయినట్లు తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

సలార్‌తో మరోసారి ట్రాక్‌లో
'బాహుబలి' వంటి సక్సెస్‌ల తర్వాత ప్రభాస్ 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని అందించలేదు. ఈ పరిస్థితుల్లోనే గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ప్రభాస్‌ను హిట్ ట్రాక్ ఎక్కించింది.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీ
ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోన్న ప్రభాస్.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ పార్ట్ 2', 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
గాయాలతో బ్రేకులు ఇచ్చి
ఎప్పుడైతే పాన్ ఇండియా స్టార్‌గా మారాడో.. అప్పటి నుంచి రెబెల్ స్టార్ ప్రభాస్ మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు, షూటింగ్‌లలో కూడా రిస్క్‌లు చేస్తున్నాడు. ఇలా ప్రభాస్ చాలా సార్లు గాయాలపాలు కూడా అయ్యాడు. దీంతో పలుమార్లు విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఇప్పుడు కూడా అతడు లండన్‌లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది.

లండన్‌లో రెండు ఇంట్లో
సినిమాల చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో చాలా సార్లు దెబ్బలు తగిలించుకున్న ప్రభాస్.. పలు దేశాల్లో సర్జరీలు కూడా చేయించుకున్నాడు. ముఖ్యంగా లండన్‌లు పలుమార్లు చికిత్సలు చేయించుకున్నాడు. దీంతో ఇటీవలే అతడు అక్కడ ఓ విలాసవంతమైన ఇంటిని రెంట్‌కు తీసుకున్నాడని న్యూస్ లీకైంది. దీంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కూడా అయిపోయింది.
ఇంటివాడైన రెబెల్ స్టార్
ప్రభాస్ లండన్ ఇల్లు గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అతడు ఉంటోన్న ఇంటిని రెంట్‌కు తీసుకోలేదట. దాన్ని ఈ స్టార్ హీరో కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనికోసం ప్రభాస్ భారీ మొత్తాన్నే వెచ్చించాడట. దీంతో ఇప్పుడిదే వార్త టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతోంది. అన్నట్లు ఈ ఇల్లు చాలా సుందరంగా ఉంటుందని కూడా తెలిసింది.

ఆ ఖర్చు కంటే బెటర్‌గా
ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా ప్రభాస్ టక్కున లండన్ బయలుదేరుతున్నాడు. అక్కడ తరచూ హోటల్స్‌లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఏకంగా ఆ నగరంలో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు దీన్ని మాత్రం ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











