‘కన్నప్ప’లో ప్రభాస్ కు రెమ్యునరేషన్ ఎంత? షాకింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతున్నారు మన ప్రభాస్. మాస్ యాక్షన్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నారు. 'బాహుబలి' మొదలు వరుస పెట్టి సినిమాలతో అదరగొడుతున్నారు. సినిమా సినిమాకు అంతకంతకు బడ్జెట్ ను పెంచుతూ పోతున్నారు. సినిమా స్కేల్ కూడా పెరుగుతూ ఆడియెన్స్ లో భారీ అంచనాలను నెలకొల్పుతున్నారు. ప్రభాస్ చివరిగా 'కల్కి 2898 ఏడీ'తో మరోసారి గర్జించిన విషయం తెలిసిందే. ఈ మైథలాజికల్ ఫిల్మ్ ను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసి ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు. నెక్ట్స్ కల్కి2పై భారీ అంచనాలను సెట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే అభిమానులను దృష్టిలో పెట్టుకొని గెస్ట్ అపియరెన్స్ కూడా ఇస్తున్నారు. గతంలో అక్షయ్ కుమార్ చిత్రంలోని ఓ సాంగ్ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు... అలాగే పూరీ కొడుకు ఆకాష్ పూరీ, నవీన్ పొలిశెట్టి చిత్రాలకు ప్రమోషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా తనకు వీలైనప్పుడల్లా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కన్నప్ప'లో రుద్ర అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Rebel Star Prabhas Remuneration for Manchu Vishnu s Kannappa Movie

అయితే.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఈ సందర్బంగా 'కన్నప్ప' టీమ్ నుంచే ఓ న్యూస్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం మంచు విష్ణు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. గతం నుంచే వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఎలాంటి ఛార్జీ లేకుండా ప్రత్యేక పాత్రలో నటించారంట. ప్రభాస్ కు స్నేహితులంటే ఎంత ఇష్టమో ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ఇక మంచు విష్ణు సినిమాకు ఇలా సాయం చేసి తన ఫ్రెండ్ షిప్ కు ఇచ్చే విలువను మరోసారి చాటుకున్నారు.

ఇక కన్నప్ప చిత్రం మంచు మనోజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. పైగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో భారీ తారాగణం కూడా నటించేందుకు ఒప్పుకోవడం విశేషం. మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్ కు దర్శకుడు కావడం మరో విశేషం. ఇక శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, రుద్ర పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్, కిరాత పాత్రలో మోహన్ లాల్, పార్వతీ పాత్రలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. న్యూజిలాండ్ లోనే ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి ఓ సాంగ్ కూడా విడుదలైంది. ఏప్రిల్ 25 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

More from Filmibeat

Read more about: baktha kannappa prabhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X