twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger రికార్డులు.. ఎక్కడా తగ్గకుండా భారీ రేట్లకు నాన్ థియేట్రికల్ హక్కులు..ఎంతకు అమ్ముడయ్యాయి అంటే?

    |

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. థియేట్రికల్ రైట్స్ సంగతి పక్కన పెడితే నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    నిర్మాణ భాగస్వామిగా

    నిర్మాణ భాగస్వామిగా

    ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా ప్రారంభించాడు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నా సరే విజయ్ దేవరకొండకు నార్త్ మార్కెట్లో డబ్బింగ్ సినిమాల ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటానని ముందుకు వచ్చాడు.

    అనన్య పాండే హీరోయిన్ గా

    అనన్య పాండే హీరోయిన్ గా

    అలా ఈ సినిమా కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్స్ బ్యానర్ల మీద నిర్మితమవుతుంది అయితే నిర్మాణ బాధ్యతలు అన్నీ కూడా పూరి కనెక్ట్స్ తరఫున ఛార్మి చూసుకుంటున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మొట్టమొదటిసారిగా అమెరికా లెజెండ్ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

    14 కోట్ల రూపాయలు

    14 కోట్ల రూపాయలు

    ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా రైట్స్ కి కూడా అద్భుతమైన డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ సుమారు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా ప్రచారం మొదలైంది. అందులో 85 కోట్లు కేవలం డిజిటల్ అలాగే శాటిలైట్ రైట్స్ కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. మరో 14 కోట్ల రూపాయలు వెచ్చించి సోనీ మ్యూజిక్ కంపెనీ ఆడియో రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    పోటా పోటీగా

    పోటా పోటీగా

    అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారు కానీ థియేట్రికల్ రైట్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం దిల్ రాజుకు అన్ని విషయాల్లో పోటా పోటీగా నిలుస్తున్న వరంగల్ శ్రీను ఈ సినిమా హక్కులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని అయితే రేటు తెగకపోవడంతో ఇంకా డీల్ క్లోజ్ అని తెలుస్తోంది..

    ఆగస్టు 25 వ తేదీన

    ఆగస్టు 25 వ తేదీన


    ఒక స్లమ్ ఉండే ఛాయ్ బండి నడుపుకునే వ్యక్తి ప్రపంచ స్థాయి బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్టుతో పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు ఆగస్టు 25 వ తేదీన ఈ సినిమా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    The non-theatrical rights of the movie Liger, directed by పూరి Jagannadh and starring Vijay Devarakonda as the hero, have sold at a huge rate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X