వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ కోసం విజయ్ కి రికార్డ్ రెమ్యునరేషన్.. టాలీవుడ్ లో మరే హీరోకు లేనంతగా?
తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ స్టార్ డమ్ గురించి సగటు సినీ ప్రేమికుడికి పరిచయం అవసరం లేదు. విజయ్ యొక్క గత కొన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రికార్డులను బద్దలు కొట్టాయి. దీంతో ఇప్పుడు ఆయన అత్యంత డిమాండ్ ఉన్న కోలీవుడ్ స్టార్‌లలో ఒకరిగా మార్చాయి. అందుకే వంశీ పైడిపల్లి విజయ్‌తో ద్విభాషా ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నారు. తాజా సంచలన సమాచారం ప్రకారం విజయ్‌కి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మొత్తం చెల్లించబడుతుంది. వివరాల్లోకి వెళితే..

విజయ్ హీరోగా
దళపతి విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా మంచి మారెక్ట్ చేస్తుంటాయి. తమిళంలోనే కాక విజయ్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. చివరగా వచ్చిన మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింqది. అయితే ఇప్పుడు విజయ్ నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. మహర్షి సినిమా తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి వంశీ పైడిపల్లి రాసుకున్న కథలో విజయ్ హీరోగా కనిపించబోతున్నాడు.

విజయ్‌కి మొదటి సినిమా
"కోవిడ్ కేసులు తగ్గిన వెంటనే నా కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ లో తలపతి విజయ్ హీరోగా నటించనున్నాడు. కోవిడ్ నేపథ్యంలో ఇంకా సినిమాను ప్రకటించలేదు'' అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. తెలుగులో విజయ్‌కి మొదటి సినిమా అయిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.

80 కోట్ల దా
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేమంటే విజయ్ ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణగా నిలవబోతున్నాడు కాబట్టి, అందుకే అతనికి ఈ చిత్రానికి 80 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇది కాకుండా, అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. తద్వారా అతనికి వచ్చే లాభాల్లో వాటా కూడా లభిస్తుందని అంటున్నారు. అంటే రెమ్యునరేషన్ సహా వాటా కలుపుకుంటే 80 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు.

సినిమా సెట్స్ పైకి
విజయ్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మరియు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తలపతి 65లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో తొలిసారి పూజా హెగ్డేతో కలిసి నటించనున్నాడు.
Recommended Video

పవన్ కంటే ఎక్కువే
ఇక ఈ కథ విన్న విజయ్.. గత 20 ఏళ్లలో ఇలాంటి స్టోరీ వినలేదని అన్నాడు అని దిల్ రాజు తాజాగా వెల్లడించారు. ఇక ఈ దీపావళికి ఈ సినిమాను రెడీ చేసి విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడట. ఒకరకంగా తెలుగులో ప్రభాస్ మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఆ తరువాత వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్‌కు 50 కోట్లు తీసుకున్నాడని టాక్. అలా మొత్తానికి విజయ్‌కి మాత్రం 80 కోట్ల దాకా అందుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











