ఫైనల్ గా పార్వతి మిల్టన్
జల్సా చిత్రంలో తన సెక్సీ లుక్స్ తో స్టైల్స్ తో ఇలియానాకి పోటీ ఇచ్చి కుర్రకారుని ఆకట్టుకున్న పార్వతి మిల్టన్ హఠాత్తుగా మాయమైంది. ఆ మధ్య మహేష్ వరుడు చిత్రంలో సెలక్ట్ అయ్యానన్న హ్యాపీతో అందరికీ పార్టిలు ఇచ్చిన ఆమె ఆ సినిమాలో నుంచి తనని తప్పించటంతో డిప్రెషన్ లో కి వెళ్ళిందని సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె తనవాళ్ళున్న అమెరికాకు వెళ్ళిందని తెలుస్తోంది. ఎంతో క్లోజ్ గా మెలిగినా త్రివిక్రమ్ సైతం ఆ తర్వాత ఫోన్ చేసి అసలు విషయం చెప్పలేదని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అనూష్కని తీసుకుని తనని తప్పించారని అర్ధం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయిందని సమాచారం.
ఇక ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఆమె డేట్స్ కోసం సంప్రదించగా ఆమె సెల్ కట్టేసి కూర్చుందని తెలిసింది. అయితే మహేష్ నిర్ణయం మేరకే ఆమెను ప్రక్కకు పెట్టాల్సి వచ్చిందని అదే కారణమని ఆమెకు సంభందించిన వారు అడగగా త్రివిక్రమ్ చెప్పి ఆ తర్వాత సినిమాకు తప్పని సరిగా ఆఫర్ ఇస్తానని ప్రామిస్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే పార్వతి మాత్రం పగపట్టిన పడుచులా తను పూర్తి స్ధాయి ఎలివేట్ అయ్యే..తనను అందరూ వెతుక్కుంటూ వచ్చే స్క్రిప్టుతో బయిటకు వస్తానని, వెయిట్ చేస్తానని చెప్తోందంటున్నారు. ఏదైమైనా జల్సా హిట్ తో పూర్తి స్ధాయి బిజీ అవుతుందనుకున్న ఈ ముద్దు గుమ్మ ఇలా తెరమరుగుఅవటం భాధాకరమేనంటున్నారు ఆమె అభిమానులు.


Click it and Unblock the Notifications











