twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిగొచ్చిన వర్మ - ‘రెడ్డి గారు పోయారు’ టైటిల్ చేంజ్?

    By Bojja Kumar
    |

    వివాదాస్సద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'రెడ్డి గారు పోయారు' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. వర్మ ఈ టైటిల్ ప్రకటించిందే ఆలస్యం....'రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్' నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. వెంటనే టైటిల్ మార్చాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్ అభిమానుల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ దిగొచ్చినట్లే కనిపిస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్ ను 'రెడ్డి గారు పోయారు'అని కాకుండా 'ఆయన పోయారు'గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

    కాగా...టైటిల్ మార్చాలని వచ్చిన హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. 'రెడ్డి గారు పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?'' అని వ్యాఖ్యానించారు. వర్మ వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరినట్లయింది. అయితే వైఎస్‌ఆర్ అభిమానులు తన బెండు తీస్తారని గ్రహించిన వర్మ టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వివాదం మరింత ముదిరి తారా స్థాయికి చేరిన తర్వాత తన సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చిన తర్వాత టైటిల్ మార్చే అవకాశం ఉంది. గతంలో బెజవాడ రౌడీలు అనే టైటిల్ ప్రకటించిన వర్మ చివరి క్షణంతో దాని పేరును 'బెజవాడ'గా మార్చిన విషయం తెలిసిందే.

    English summary
    Now, the buzz is that Ram gopal varma might wait for the controversy to reach the peak and the film gets maximum mileage and then amends the title to ‘Aayana Poyaru’. If one can recall, he did something similar with his earlier project ‘Bejawada’ which started off as ‘Bejawada Rowdylu’ and eventually got clipped. This should be interesting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X