చిరంజీవి కోసం కొరటాల స్పైసీ ప్లాన్.. అందుకోసం యంగ్ హీరోయిన్‌ను దింపుతున్నారు.!

By Manoj

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో, ఆయన వెంటనే 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఇది పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును ఓకే చేసేశారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో స్పైసీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...

 ఆ సినిమా ఇద్దరికీ నిరాశనే మిగిల్చింది

ఆ సినిమా ఇద్దరికీ నిరాశనే మిగిల్చింది

మెగాస్టార్ చిరంజీవి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా సహా ఎంతో మంది ప్రముఖులు నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. కలెక్షన్లు రాబట్టడంలో మాత్రం విఫలం అయింది.

బడా డైరెక్టర్‌తో రెడీ అయిన చిరంజీవి

బడా డైరెక్టర్‌తో రెడీ అయిన చిరంజీవి

‘సైరా' తర్వాత మెగాస్టార్.. బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థతో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇందులో త్రిషను హీరోయిన్‌గా తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొరటాల మార్క్ మిస్ అవకుండా ఈ సినిమా రూపొందుతుందని టాక్.

కొరటాల శివపై ఒత్తిడి.. అందుకే ఇలా

కొరటాల శివపై ఒత్తిడి.. అందుకే ఇలా

భారీ అంచనాలతో వచ్చిన ‘సైరా' అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో.. మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ కొరటాల శివ సినిమాపైనే ఉన్నాయి. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగిపోతోందని తెలుస్తోంది. ఈ కారణంగా ఈ బడా డైరెక్టర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన అన్నీ పక్కాగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కథకు అనుగుణంగానే టైటిల్ కూడా

కథకు అనుగుణంగానే టైటిల్ కూడా

ఈ సినిమా దేవాలయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తికి సంబంధించిన కథతో తెరకెక్కుతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నాయి. అందుకే ఈ సినిమాకు డివోషనల్ ఫీల్ వచ్చేలా ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ ప్రకటించారు. ఇందులో చిరు రెండు పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఈ టైటిల్‌ను ‘గోవిందా హరి గోవిందా'గా మార్చారని కూడా టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి కోసం కొరటాల స్పైసీ ప్లాన్

చిరంజీవి కోసం కొరటాల స్పైసీ ప్లాన్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. మాస్ లవర్స్ కోసం ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ను పెట్టబోతున్నారనేదే దాని సారాంశం. ఇది ఎంతో స్పైసీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. ఈ పాట కోసం యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాను తీసుకొస్తున్నారని సమాచారం.

హిట్టుతో పాటు ప్రశంసలు కూడా

హిట్టుతో పాటు ప్రశంసలు కూడా

రెజీనా కొద్ది రోజుల క్రితం ‘ఎవరు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తం రెజీనా చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఆమెను హైలైట్ చేశారు. అందుకు తగ్గట్లే రెజీనా ఇందులో అదిరిపోయే నటనను కనబరిచింది. అలాగే, ఆమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X