మరో మెగా క్యాంప్ హీరో సరనస రెజీనా ఎంపిక
ఇక రెజీనా ప్రస్తుతం నారా రోహిత్ చిత్రం కూడా ఓకే చేసింది. తాతినేని సత్య దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. జనవరి రెండవవారంలో సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రాలు కాక రెజీనా ఒప్పుకోవాల్సిన చిత్రాలు మరిన్ని ఉన్నాయి. 'రొటీన్ లవ్ స్టోరీ' టాక్ బాగోకపోయినా ఆమెకు మాత్రం వరస ఆపర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.
రెజీనా తనకు తెలుగులో అవకాశాలు...గురించి చెప్తూ...ఎస్ ఎమ్ ఎస్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు వెళ్లా. 'రొటీన్ లవ్‌స్టోరీ' మంచి ఫలితాన్నిచ్చింది. కన్నడలో చేసిన 'సూర్యగాంధీ' చక్కటి వసూళ్లు సాధించింది. 'కేడీ బిల్లా కిలాడి రంగ' మరో హిట్ అందించింది. తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నా. ఇంకా పేర్లు పెట్టలేదు. మలయాళంలో విడుదలైన 'సాల్ట్ అండ్ పెప్పర్' తమిళ రీమేక్ 'ఉన్ సమయల్ అరైయిల్'లో కూడా నటిస్తున్నా. తమిళంలో 'నిర్ణయం' అనే చిత్రాన్ని కూడా అంగీకరించా అని చెప్పింది.


Click it and Unblock the Notifications












