నిర్మాతగా ఎ.ఆర్.రహమాన్?

అది విన్న రహమాన్ లేచి కమల్ ని హత్తుకుని మెచ్చుకున్నాడట. తాను కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటానని చెప్పాడట. కమల్ మరో సారి ఆలోచించుకోమని చెప్పినా కాదన్నాడని...ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పాడని తెలుస్తోంది. నిజానికి మొదట ఈ కథని కమల్ భారత్ బాల ప్రొడక్షన్స్ పై ఆడ్ లాబ్స్ వారితో కలపి తీద్దామనుకున్నాడు. కాని పరిస్ధితులు మారాయి.
అనుకోని విధంగా రహమాన్ రంగంలోకి దిగాడు. అయినా కళాకారులు తాము సంపాదించిన డబ్బుతో సినిమాలు తీయటం పెట్టుబడి పెట్టడం పరిశ్రమకు కొత్తేమీ కాదు.ఇప్పుడు రహమాన్ ఆ రూటులోనే వెళ్తున్నాడంటున్నారు. అయినా ఇన్నాళ్ళుగా అంటే కెరీర్ ప్రారంభం నుండీ ఆయన సంపాదించిన సొమ్ముని ఇలా రీళ్ళ పాలు చేయటం భావ్యమా అని చేతులు కాల్చుకున్న సీనియర్లు అంటున్నారు.


Click it and Unblock the Notifications











