ప్రభాస్ ‘జాన్’ నుంచి షాకింగ్ అప్‌డేట్: మరోసారి రాజమౌళి సినిమాతో వస్తున్నాడట

By Manoj Kumar P

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా స్టార్‌డమ్ దక్కించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా అతడి కెరీర్‌తో పాటు మార్కెట్‌ను అమాంతం పెంచేసింది. దీని తర్వాత అతడు నటించిన చిత్రం 'సాహో'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా కావడంతో ఇది చర్చనీయాంశం అయింది.

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్‌తో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అతడు మరో సినిమాను స్టార్ట్ చేసేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే...

సరికొత్త యాంగిల్ చూపించబోతున్నాడు

సరికొత్త యాంగిల్ చూపించబోతున్నాడు

‘సాహో' వంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్'. ఈ సినిమాను ‘జిల్' ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది.

ఒక్కరు కాదు ఇద్దరు ప్రభాస్‌లు

ఒక్కరు కాదు ఇద్దరు ప్రభాస్‌లు

రొమాంటిక్ జోనర్‌లో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చింది. అందులో ఒక పాత్ర తండ్రిది కాగా, రెండోది కొడుకుదని అంటున్నారు. ప్రభాస్ ‘బాహుబలి'లో కూడా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 రిచ్‌గా ప్రభాస్.. పూర్‌గా పూజా

రిచ్‌గా ప్రభాస్.. పూర్‌గా పూజా

ఈ సినిమా 1960వ దశకంలో విదేశాల్లో జరిగే ప్రేమకథతో రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ కథ ప్రకారం ప్రభాస్ ధనవంతుల కుమారుడిగా కనిపిస్తాడట. అదే సమయంలో పూజా హెగ్డే పేదింటి అమ్మాయి పాత్ర చేస్తుందట. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుందని సమాచారం.

ప్రభాస్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

ప్రభాస్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

తాజాగా ప్రభాస్ ‘జాన్'కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందనేదే ఆ వార్త సారాంశం. 1960ల నాటి ప్రేమకథ విఫలం అవడం.. ప్రస్తుత జనరేషన్‌లో వాళ్లిద్దరూ మళ్లీ కలవడం వంటి లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. గతంలో ఇదే లైన్‌తో పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

Recommended Video

Arjun Suravaram Movie Review | Samantha In Family Man Season 2
 రాజమౌళి సినిమాలో చూపించినట్లే..

రాజమౌళి సినిమాలో చూపించినట్లే..

గతంలో దర్శకధీరుడు రాజమౌళి - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మగధీర'. ఈ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలోనే వచ్చింది. ఇందులో చూపించినట్లే రెండు జన్మల ప్రేమకథను ‘జాన్'లో చూపించబోతున్నారట. అందులో ఒకటి విదేశాల్లో జరిగే స్టోరీ కాగా, మరొకటి మన దగ్గర జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X