SSMB28: మహేశ్ మూవీలో మాజీ ఎంపీ.. త్రివిక్రమ్ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశాడంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. విజయాలను సొంతం చేసుకుంటూ.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ స్టార్ హీరో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే మహేశ్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే.
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీలో విషాదాలు జరగడంతో దీనికి బ్రేక్ పడిపోయింది. ఇక, కొంత గ్యాప్ తర్వాత రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించి చిత్ర యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇటీవలే మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మించింది. ఇప్పుడు ఇందులోనే సినిమా షూటింగ్‌ను జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

కుటుంబ కథతో రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది బడా స్టార్లు నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఎంతో మంది వేరే భాషలకు చెందిన నటీనటులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖను తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఈ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. అంతేకాదు, ఆమెతో త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నారని అంటున్నారు. ఆమెకు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉండడం వల్లే ఈ చిత్రానికి ఎంపిక చేశారని తెలిసింది.
ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











