సెక్స్ చూపటానికే ఆ ప్రీమేక్
ఓంపురి,రేఖ కాంబినేషన్లో వచ్చిన ఆస్ధా సినిమాని మరిచిపోని వారుండరు. ఇప్పుడా సినిమా తెలుగులో 'సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు" టైటిల్ తో ఫ్రీమేక్ అవుతోందని సమాచారం. జ్యోతి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రుతిక ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతుకు మందు రుతిక ప్రధాన పాత్రలో సారి..నాకు పెళ్లయిందిఅనే టైటిల్ తో ఓ చిత్రం వచ్చింది. దాంతో ఆమెనే తీసుకుని ఆ తరహా టైటిల్ పెట్టడం ద్వారా హిట్టు సాధించవచ్చునని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.
అలాగే ఆస్ధా సినిమా అప్పట్లో మనసా కవ్వించకా పేరుతో తెలుగులో డబ్ అయింది. అయితా మళ్లీ ప్రీమేక్ చేయాలని ఆలోచనకు కారణం తెరపై సెక్స్ పండించటానికి కాసులు పంచుకోవటానికే అని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్
ఇక హరీష్ దర్శకత్వంలో శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్, భార్గవ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటివరకూ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యేవరకూ నిరవధికంగా షెడ్యూల్ కొనసాగుతుందని నిర్మాత శంకర్ తెలిపారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో వినోదంతోపాటు సందేశం పుష్కలంగా ఉంటుందని" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నరేష్, పాటలు: రోహిత్, బాలభాస్కర్, సాగర్.


Click it and Unblock the Notifications











