పవన్ కళ్యాణ్ OG పై అలాంటి రూమర్లు.. స్పందించిన టీమ్.. ఏంటంటే?
పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై తన అభిమానులతో పాటు ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఎప్పుడు వెండితెరపై కనిపిస్తారనోనని ఫ్యాన్స్, ప్రేక్షకులకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తను సైన్ సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే హరి హర వీరమల్లు సినిమాలాగే ఓజీ సినిమా కూడా ఆ విషయంలో షాక్ ఇవ్వబోతుందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ హరి హర వీరమల్లు..
చివరిగా పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పొలిటికల్ ప్రొగ్రామ్స్ ను ఫుల్ బిజీ అయ్యారు. దాంతో హరి హర వీరమల్లు చిత్రం చాలా ఆలస్యం అయ్యింది. 2020లో ప్రకటించిన ఈ చిత్రం ఏకంగా 5 ఏళ్ల పాటు వాయిదా పడింది. మరోవైపు 10 సార్లు ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఎట్టకేళలకు జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరోవైపు జూలై 3న పవర్ ప్యాక్డ్ ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

ఓజీ సినిమాపై అలాంటి రూమర్లు..
పొలిటికల్ ప్రొగ్రామ్స్ ద్వారా హరి హర వీరమల్లు చిత్రం పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇదే క్రమంలోనే యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న పవన్ కళ్యాణ్ OG మూవీ కూడా విడుదల విషయంలో షాక్ ఇవ్వబోతుందని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కూడా రిలీజ్ డేట్ ను వాయిదా పడబోతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షూటింగ్ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. తాడేపల్లిగూడెంలో ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది.
ఓజీకి పక్కా ప్లానింగ్..
ప్రస్తుతం ఓజీ సినిమాపై వస్తున్న రూమర్లను మేకర్స్ కొట్టి పారేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని స్పష్టం చేశారు. ఇక 2025 సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతుండటం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. మిగితా షూటింగ్ పార్ట్ పూర్తవుతోంది. టాలీవుడ్ లో భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న చిత్రాల్లో ఇదొకటి.
పవన్ రాబోయే చిత్రాలు..
పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ హరి హర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 20 రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత ఓజీ సినిమా విడుదల అవుతుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టైమ్ ఇచ్చారు. మరి కొద్దిరోజుల్లోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. వచ్చే ఏడాది 2026 సమ్మర్ లో ప్రేక్షకుల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











