ఒడ్డున పడినట్లే : రిలయన్స్ అండతోనే ఎన్టీఆర్

By Srikanya

హైదరాబాద్ : రిలియన్స్ సంస్ధ తెలుగులో అత్తారింటికి దారేది, సాహసం చిత్రాలను నిర్మిస్తూ ముందుకు వెల్తోంది. వారు గతంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ... బివిఎస్ఎన్ ప్రసాద్ తో టై అప్ అయ్యి సినిమాలు నిర్మించారు. అదే పద్దతిలో తాజాగ ఎన్టీఆర్ చిత్రానికి సైతం వారు ఫైనాన్స్ చేయటానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. వారు ఇప్పుడు కేవలం ఫైనాన్సియర్స్ గనే కాకుండా...రియలన్స్ ఎంటర్టైన్మెంట్ వారు కూడా భాగస్వాములయ్యారు. ఇప్పుడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుంది.

అయితే రిలియన్స్ వారు అశోశియేషన్ లేకుండా...కేవలం ప్రసాద్ గారు మాత్రమే ఈ చిత్రం నిర్మిద్దామనుకున్నారు. కానీ దోచేయ్ ఎఫెక్ట్ తో రిలియన్స్ వారితో టై అప్ అయ్యారని సమాచారం. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే లండన్ లో ప్రారంభం కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి ‘మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Reliance Entertainment to co-produce NTR’s next

ఇక ఇప్పటికే...

సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవి తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళి వచ్చారు. ఈ సినిమాకి ట్యూస్స్ సమకూర్చే పనిలో ఏప్రిల్ 9వరకూ అక్కడే గడపారు. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రం అఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం. అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు.

దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X