పవన్ కళ్యాణ్ కోసం రిలయన్స్ టైఅప్
గతంలో మంచు విష్ణుతో సలీం చిత్రం, జెడి చక్రవర్తితో మనీ మనీ మోర్ మనీ చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్న రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్ధ మరో సారి తెలుగులో చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపుతోంది. బివియస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న మూడు చిత్రాలకు వారు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం. ఆ మూడు సినిమాలు వరసగా పవన్ కళ్యాణ్,పూరీ జగన్నాధ్,గోపీచంద్ లతో ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో చేసే చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తారు.
ఇక పూరీ, రవితేజ కాంబినేషన్ లో ప్రకటించిన దేముడు చేసిన మనుష్యులు చిత్రం,యేలేటి చంద్రశేఖర్,గోపీచంద్ కాంబినేషన్ చిత్రంకు ఈ టైఅప్ ఉంటుంది. మినిమం గ్యారెంటీ చిత్రాలకి టై అప్ చేద్దామనే ఉద్దేశ్యంతోనే వారు ఈ మూడు ప్రాజెక్టులకు టైఅప్ అవుతున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ చిత్రంతో పూరీ మరో సారి కమర్షియల్ దర్శకుడుగా ఎదగటంతో అతని రెండు ప్రాజెక్టులపై డబ్బు పెట్టడం వారు సేఫ్ ప్రాజెక్టులుగా భావిస్తున్నారు. ఇక బివియస్ ఎన్ ప్రసాద్ ఊసరవెల్లి చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా నిర్మించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. ఈ మూడు చిత్రాలపై ఆయన బాగా నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications