Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రామయ్యా వస్తావయ్యా’లో ఆ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్??
హైదరాబాద్ :ఎన్టీఆర్, సమంత జంటగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం దశరా కానుకగా రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ఓ రీమిక్స్ పాట ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ సూపర్ హిట్ సింహాద్రి చిత్రంలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి పాటను రీమిక్స్ చేసారని, దాన్ని సీక్రెట్ గా ఉంచి, థియోటర్ లో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరచాలని హరీష్ శంకర్ ఆలోచన అని చెప్పుకుంటున్నారు. దాని నిమిత్తం సింహాద్రి నిర్మాత విజయకుమార్ వర్మ నుంచి రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆ పాట ఉందా లేక రూమరా అన్నది రేపటికల్లా తేలిపోతుంది.
చిత్రం గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ.... ఈ సినిమాలో సమంతని ఎన్టీఆర్ టీజ్ చేస్తూ ఉంటాడు. ఆ సీన్లు చాలా బాగున్నాయి. శ్రుతీ ఇందులో అతిథి పాత్రలో నటిస్తోంది. అంతేకానీ సెకెండ్ లీడ్ కాదు. కథలో ఇద్దరు హీరోయిన్స్ కీ ప్రాధాన్యం ఉంది. వారి పాత్రలే కీలక మలుపు తిప్పుతాయి. మహిళలకు బాగా నచ్చుతుంది.
అలాగే నేను సమంతకి ఫ్యాన్‌ని. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఆమె సినిమాలు చూసి ఫ్యాన్ అయిపోయా. భీముడు పట్టాల్సిన గదని రాముడు పట్టాడంటే దాన్ని మీరు తెరమీద చూడాల్సిందే. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్‌కి తమన్ ఆర్.ఆర్.సూపర్‌గా ఇచ్చారు. ఇప్పటికే పాటలు హిట్ అయ్యాయి. 'జాబిలి' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది అన్నారు.
ఇక ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో ఏదైనా చేయగలడు. నాకు తెలిసి... డ్యాన్స్‌ని గానీ, డైలాగ్స్‌ని గానీ, యాక్షన్ సీన్స్‌ని గానీ సింగిల్ టేక్‌లో చేయగల హీరో ఎన్టీఆర్ తప్ప ఎవరూ లేరు. ఎన్టీఆర్ కోసం 'రామయ్యా వస్తావయ్యా' స్క్రిప్టును తయారు చేశాం. దీనికోసం తొమ్మిది నెలలు కష్టపడ్డాం. నేను, రచయితలు, నా సహాయ దర్శకులు అంతా ఎంతో కష్టపడి పనిచేసి దీన్ని రెడీ చేశాం. ఎన్టీఆర్‌ని యూత్‌ఫుల్‌గా చూపించాలి అనుకున్నాం. ఎన్టీఆర్ ఎంతో కష్టపడటం వల్ల ఇందులో ఆయన లుక్ బాగుంది. అతనికున్న హెయిర్స్టైల్నే చాలా అందంగా చూపించాం. ఇందులో వన్‌లైనర్స్ అభిమానులను బాగా అలరిస్తాయి.